Share News

YSRCP Fake Campaign: ప్రధాని మోదీ పర్యటన.. వైసీపీ ఫేక్ ప్రచారం

ABN , Publish Date - Oct 16 , 2025 | 05:31 PM

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇవాళ(గురువారం) కర్నూలు జిల్లాలో పర్యటించారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ పర్యటనను సైతం వైసీపీ నేతలు ఫేక్ ప్రచారానికి వాడుకుంటున్నారు. వైసీపీ ఫేక్ ప్రచారంపై కేంద్ర ప్రభుత్వ ఇంటెలిజెన్స్ ఆరా తీసింది.

YSRCP Fake Campaign: ప్రధాని మోదీ పర్యటన.. వైసీపీ ఫేక్ ప్రచారం
YSRCP Fake Campaign

కర్నూలు, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) ఇవాళ(గురువారం) కర్నూలు జిల్లా (Kurnool District)లో పర్యటించారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ పర్యటనను సైతం వైసీపీ నేతలు ఫేక్ ప్రచారానికి (YSRCP Fake Campaign) వాడుకుంటున్నారు. ప్రధానికి ఆహ్వానం పలికిన సందర్భాన్నీ వదిలిపెట్టకుండా తప్పుడు ప్రచారానికి తెరతీశారు. ఈ మేరకు వైసీపీ ఫేక్ ప్రచారంపై కేంద్ర ప్రభుత్వ ఇంటెలిజెన్స్ ఆరా తీసింది.


ఈ కార్యక్రమంలో భాగంగా వైసీపీ ప్రజాప్రతినిధులు నన్నూరు సభ వద్దకు చేరుకున్నారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయకూడదని, అలాగే వాల్మీకిలను ఎస్టీల్లో చేర్చే అంశాలను పరిశీలించాలని ప్రధానికి వినతిపత్రం ఇచ్చినట్లు ఆ పార్టీ సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. ప్రధానికి వినతిపత్రం ఇవ్వకుండానే ఆయా అంశాలపై కోరినట్లు అసత్య ప్రచారానికి దిగారు వైసీపీ శ్రేణులు. జగన్ మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఏనాడూ ప్రధాని మోదీ పర్యటనకు ప్రోటోకాల్ ప్రకారం ప్రతిపక్షపార్టీని ఆహ్వానించలేదు.


కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాని కార్యక్రమాల్లో ప్రోటోకాల్ ప్రకారం వైసీపీ ప్రజా ప్రతినిధులకు సైతం ఆహ్వానం పలికింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న అన్ని అభివృద్ధి కార్యక్రమాల్లోనూ పార్టీలకి అతీతంగా ప్రోటోకాల్ పాటించి ప్రజాప్రతినిధులని గౌరవించింది. కూటమి ప్రభుత్వం ఇచ్చిన గౌరవాన్ని కూడా నిలబెట్టుకోలేదు వైసీపీ ప్రజా ప్రతినిధులు. ప్రధాని కార్యక్రమాన్ని సైతం తమ ఫేక్ ప్రచారానికి వాడుకుంటోంది వైసీపీ..


ఈ వార్తలు కూడా చదవండి:

Pawan Kalyan On GST Meeting: ప్రధాని మోదీని కర్మయోగిగా చూస్తాం: పవన్‌ కల్యాణ్‌

PM Modi On GST Meeting: నన్నూరులో 'సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్' బహిరంగసభ ప్రారంభం.. పాల్గొన్న ప్రధాని మోదీ

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 16 , 2025 | 06:58 PM