Srisailam Temple: శ్రీశైలం దేవస్థానంలో ఇద్దరు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు.. ఎందుకంటే..
ABN , Publish Date - Jun 22 , 2025 | 03:01 PM
శ్రీశైలం దేవస్థానంలో ఇద్దరు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడింది. శ్రీశైలం దేవస్థానం క్యాషియర్ బీ. శ్రీనివాసులు, జూనియర్ అసిస్టెంట్ మంజనాథ్‌ని సస్పెండ్ చేస్తూ ఆలయ ఈఓ శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు. గత నెల 27వ తేదీన చంద్రావతి కల్యాణ మండపంలో జరిగిన హుండీ లెక్కింపులో ఉద్యోగులు అలసత్వం ప్రదర్శించడంతో ఈ చర్యలు చేపట్టారు.

నంద్యాల: శ్రీశైలం దేవస్థానంలో (Srisailam Temple) ఇద్దరు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడింది. శ్రీశైలం దేవస్థానం క్యాషియర్ బీ. శ్రీనివాసులు, జూనియర్ అసిస్టెంట్ మంజనాథ్‌ని సస్పెండ్ చేస్తూ ఆలయ ఈఓ శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు. గత నెల 27వ తేదీన చంద్రావతి కల్యాణ మండపంలో జరిగిన హుండీ లెక్కింపులో ఉద్యోగులు అలసత్వం ప్రదర్శించడంతో ఈ చర్యలు చేపట్టారు. హుండీ కౌంటింగ్ సమయంలో విధుల పట్ల నిర్లక్ష్యం వహించారని విచారణలో తేలడంతో ఇద్దరు ఉద్యోగులని సస్పెండ్ చేశామని ఈఓ శ్రీనివాసరావు తెలిపారు. హుండీ కౌంటింగ్ చేసేందుకు తెచ్చిన చిల్లర నాణాలు గల సంచులను లెక్కించకుండా అక్కడే వదిలేసి సిబ్బంది వెళ్లిపోయారని ఆలయ ఈఓ శ్రీనివాసరావు అన్నారు.
సెక్యూరిటీ సిబ్బంది హుండీల్లోని నాణాలు గల బ్యాగులను క్యాషియర్‌కు అప్పగించారని ఈఓ శ్రీనివాసరావు చెప్పారు. అయితే చిల్లరను క్యాషియర్ కౌంటర్ రూములో భద్రపరచడంపై భక్తుల నుంచి పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. క్యాషియర్ కౌంటర్ రూమ్‌లో హుండీల్లోని కాయిన్లను ఉంచడంపై పలువురు భక్తులు ఫిర్యాదులు చేయడంతో ఈ బాగోతం బయటపడింది. ఇటీవల సాధారణ బదీలీల్లో జూనియర్ అసిస్టెంట్ మంజూనాథ్‌ని కాణిపాకం ఆలయానికి దేవాదాయ శాఖ అధికారులు బదిలీ చేశారు. కాణిపాకం ఆలయ ఈఓకు మంజునాథ్ సస్పెండ్ కాపీలు పంపించి సస్పెన్షన్ అమలు చేయాలని శ్రీశైలం ఈఓ శ్రీనివాసరావు కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి:
గంజాయి తనిఖీలకు వెళ్లి.. కానిస్టేబుల్ మృతి
డిప్యూటీ సీఎంపై అనుచిత పోస్టులు..
విశాఖ యోగాకు గిన్నిస్ బుక్‌లో స్థానం
For More AP News and Telugu News