Home » AP Employees
సాంఘిక సంక్షేమ బీసీ గురుకుల హాస్టళ్లలో వసతుల కల్పనలో అధికారుల నిర్లక్ష్యంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జిల్లా స్థాయి అధికారులు హాస్టళ్లను సందర్శించి పరిస్థితులను ఎందుకు చక్కదిద్దడం లేదని ప్రశ్నించింది. అధికారుల ప్రవర్తనపై ఏపీ హై కోర్టు ఆసహనం వ్యక్తం చేసింది.
వ్యవసాయంలో కీలకమైన సాగునీటి సంఘాల వ్యవస్థ జిల్లాలో నిర్వీర్యమైపోతోంది. గత ప్రభుత్వంలో కమిటీలను నియమించకపోవడం, ఇంజనీర్లకు ప్రత్యేకాధికారుల బాధ్యతలు అప్పగించడంతో వ్యవస్థ చిన్నాభిన్నమైంది. ఒక పద్ధతి, విధానం అంటూ లేకుండా సంఘాల నిర్వహణ జరగడంతో ఆ ప్రభావం కొత్తగా ఎన్నికైన వారిపై పడుతోంది.
జిల్లా గృహ నిర్మాణ శాఖలో వైసీపీ హయాం నుంచి లెక్కలేనన్ని అక్రమాలకు పాల్పడిన ఇన్‌చార్జ్ ప్రాజెక్టు డైరెక్టర్ వి.సాంబశివయ్య పాపం ఎట్టకేలకు పండింది..
మంగళగిరి అభివృద్ధిపై మంత్రి నారా లోకేష్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. నియోజకవర్గాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. మంగళగిరిలో రోడ్లపై ఎక్కడ గుంతలు లేకుండా చూడాలని దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు అధికారులకు మంత్రి నారా లోకేష్ వందరోజుల కార్యాచరణ రూపొదించారు.
శ్రీశైలం దేవస్థానంలో ఇద్దరు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడింది. శ్రీశైలం దేవస్థానం క్యాషియర్ బీ. శ్రీనివాసులు, జూనియర్ అసిస్టెంట్ మంజనాథ్‌ని సస్పెండ్ చేస్తూ ఆలయ ఈఓ శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు. గత నెల 27వ తేదీన చంద్రావతి కల్యాణ మండపంలో జరిగిన హుండీ లెక్కింపులో ఉద్యోగులు అలసత్వం ప్రదర్శించడంతో ఈ చర్యలు చేపట్టారు.
ఏపీ ఉద్యోగుల బదిలీలపై కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల సాధారణ బదిలీల గడువు జూన్ 9వ తేదీ వరకు పొడిగించింది.ఉద్యోగుల బదిలీలపై మే15వ తేదీన మార్గదర్శకాలను ప్రభుత్వం జారీ చేసింది.
AP Government: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీఎస్ ఆర్టీసీలో 1 /2019 సర్క్యూలర్ పునరుద్దరించాలని నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం నిర్ణయంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
MP Kesineni Sivanath: మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డికి తెలుగుదేశం విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ మాస్ వార్నింగ్ ఇచ్చారు.జగన్ ఇప్పటికైనా తన పద్ధతి మార్చుకోవాలని లేకపోతే చూస్తూ ఊరుకోమని ఎంపీ కేశినేని శివనాథ్ హెచ్చరించారు.
Minister Dola Bala Veeranjaneya Swamy: గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ కోసం జిల్లాలో మూడంచెల వ్యవస్థ తెస్తామని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ప్రకటించారు. ఉద్యోగుల సీనియారిటీతో పదోన్నతికి ఒక ప్రత్యేక చానల్ తెచ్చామని గుర్తుచేశారు.
AP Government: సచివాలయాల హేతుబద్దీకరణపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జనాభా ప్రాతిపదికగా గ్రామ, వార్డు సచివాలయాలను హేతుబద్ధీకరించనున్నారు. గత ప్రభుత్వంలో ఏర్పాటైన ఈ వ్యవస్థను గాడిన పెట్టడంతోపాటు పని భారం, జనాభా సంఖ్యను పరిగణనలోకి తీసుకుని సిబ్బందిని సర్దుబాటు చేస్తారు.