AP Government: ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ABN , Publish Date - Dec 01 , 2025 | 07:19 PM
ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఏపీ సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లోకి ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగ సంఘాలను, ఎన్ఎంయూఏ, ఎంప్లాయీస్ యూనియన్లను చేర్చింది రాష్ట్ర ప్రభుత్వం.
అమరావతి, డిసెంబరు1 (ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ ఉద్యోగుల (APSRTC Employees) సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం (AndhraPradesh Government) చర్యలు చేపట్టింది. ఏపీ సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లోకి ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగ సంఘాలను, ఎన్ఎంయూఏ, ఎంప్లాయీస్ యూనియన్లను చేర్చింది రాష్ట్ర ప్రభుత్వం. రెండు ప్రధాన సంఘాలకు ఉద్యోగుల జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లో సభ్యత్వం మంజూరు చేసింది.
సభ్యత్వం మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. ఈమేరకు ఉత్తర్వులు జారీ చేశారు జీఏడీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ ఎస్ రావత్. సభ్యత్వం రావడంతో ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు సత్వరమే పరిష్కారమయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో జరిపే చర్చల్లో ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు పాల్గొనే సదుపాయం కల్పించింది.
ఉద్యోగుల సర్వీసు రూల్స్, పదోన్నతులు తదితర సమస్యలను నేరుగా ప్రభుత్వానికి తెలియజేసే అవకాశం ఉంది. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలపై ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంతో చర్చించేందుకు అవకాశం కల్పించింది. సభ్యత్వం మంజూరుపై సీఎం చంద్రబాబుకు ఎన్ ఎంయూఏ, ఎంప్లాయీస్ యూనియన్ల నేతలు ధన్యవాదాలు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి...
పింఛన్ల పంపిణీలో ఏపీదే అగ్రస్థానం: సీఎం చంద్రబాబు
జగన్ హయాంలో ఏపీ అస్తవ్యస్థం: మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి
Read Latest AP News And Telugu News