Share News

AP High Court: అధికారులూ ఇలాగేనా.. ఏపీ హైకోర్టు ఫైర్

ABN , Publish Date - Jul 21 , 2025 | 08:58 PM

సాంఘిక సంక్షేమ బీసీ గురుకుల హాస్టళ్లలో వసతుల కల్పనలో అధికారుల నిర్లక్ష్యంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జిల్లా స్థాయి అధికారులు హాస్టళ్లను సందర్శించి పరిస్థితులను ఎందుకు చక్కదిద్దడం లేదని ప్రశ్నించింది. అధికారుల ప్రవర్తనపై ఏపీ హై కోర్టు ఆసహనం వ్యక్తం చేసింది.

AP High Court: అధికారులూ ఇలాగేనా.. ఏపీ హైకోర్టు ఫైర్
Andhra Pradesh High Court

అమరావతి: సాంఘిక సంక్షేమ బీసీ గురుకుల హాస్టళ్లలో వసతుల కల్పనలో అధికారుల నిర్లక్ష్యంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (Andhra Pradesh High Court) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జిల్లాస్థాయి అధికారులు హాస్టళ్లను సందర్శించి పరిస్థితులను ఎందుకు చక్కదిద్దడం లేదని ప్రశ్నించింది. అధికారుల ప్రవర్తనపై ఆసహనం వ్యక్తం చేసింది ఏపీ హైకోర్టు. పరిస్థితులు ఇంత దారుణంగా ఉంటే అధికారులు తెలియనట్లుగా ఎలా వ్యవహారిస్తున్నారని నిలదీసింది. హైకోర్టు ఆదేశాల మేరకు విచారణకి హజరయ్యారు ఏపీ సీఎస్ విజయానంద్.


హాస్టళ్లలో వసతులను మెరుగుపరిచే విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే సాంఘిక, బీసీ, గురుకుల సంక్షేమ శాఖల ముఖ్య కార్యదర్శులను బాధ్యులను చేస్తామని హెచ్చరించింది హైకోర్టు. సీఎస్ జోక్యం చేసుకుంటేనే సమస్య పరిష్కారం అవుతుందని వ్యాఖ్యానించింది. అందువల్లే చీఫ్ సెక్రటరీ‌ను న్యాయస్థానానికి పిలిపించాల్సి వచ్చిందని పేర్కొంది. నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ మార్గదర్శకాల ప్రకారం కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేయాలని సీఎస్‌కు ఆదేశాలు జారీ చేసింది. జిల్లాస్థాయిలో హాస్టళ్లను తనిఖీ చేసే వారి పేర్లు, వారు ఎప్పుడెప్పుడు హాస్టళ్లను సందర్శించారనే వివరాలను కోర్టు ముందు ఉంచాలని ఆదేశించింది. ప్రతి నెలా స్టేటస్ రిపోర్ట్‌ను తమ ముందు ఉంచాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది.


ఈ వార్తలు కూడా చదవండి

అజ్ఞాతంలోకి పేర్ని నాని.. గాలిస్తున్న పోలీసులు..

విచారణకు హాజరు కాలేను: మాజీ మంత్రి నారాయణ స్వామి

For More Andhra Pradesh News

Updated Date - Jul 21 , 2025 | 09:29 PM