Share News

AP Secretariat Employees Elections: ఏపీలో ఎన్నికల హడావుడి.. షెడ్యూల్ విడుదల

ABN , Publish Date - Dec 03 , 2025 | 07:03 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం ఎన్నికలు ఈ నెల 23వ తేదీన జరగనున్నాయి. ఏపీ సెక్రటేరియట్ ఉద్యోగుల సంఘం ఎన్నికల నిర్వహణపై అప్సా అధ్యక్షులు వెంకట్రామిరెడ్డి అధ్యక్షతన కార్యవర్గం బుధవారం సమావేశమైంది.

AP Secretariat Employees Elections: ఏపీలో ఎన్నికల హడావుడి.. షెడ్యూల్ విడుదల
AP Secretariat Employees Elections

అమరావతి, డిసెంబరు3 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం ఎన్నికలు (AP Secretariat Employees Association Elections) ఈ నెల 23వ తేదీన జరగనున్నాయి. ఏపీ సెక్రటేరియట్ ఉద్యోగుల సంఘం ఎన్నికల నిర్వహణపై అప్సా అధ్యక్షులు కాకర్ల వెంకటరామిరెడ్డి అధ్యక్షతన కార్యవర్గం ఇవాళ(బుధవారం) సమావేశమైంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.


ఈ నెల 29వ తేదీతో ప్రస్తుత అప్సా అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి ప్యానెల్ పదవీ కాలం ముగియనుంది. ఈ క్రమంలో ఎన్నికలను ఈ నెల(డిసెంబరు) 23వ తేదీన నిర్వహించాలని అప్సా కార్యవర్గం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎన్నికల షెడ్యూల్‌ను అప్సా కార్యవర్గం ప్రకటించింది. తొమ్మిది కేటగిరీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో సచివాలయం, అసెంబ్లీతో కలిపి 1200 మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకోనున్నారు.


ఎన్నికలు జరిగే తొమ్మిది కేటగిరీలు ఇవే..

1) అధ్యక్షుడు

2) ఉపాధ్యక్షుడు

3) ఉపాధ్యక్షుడు (మహిళలు)

4) ప్రధాన కార్యదర్శి

5) అదనపు కార్యదర్శి

6) జాయింట్ సెక్రటరీ (సంస్థలు)

7) జాయింట్ సెక్రటరీ (క్రీడలు)

8) జాయింట్ సెక్రటరీ (మహిళ)

9) కోశాధికారి పదవులకు ఎన్నికలు జరగనున్నాయి.


ఎన్నికల షెడ్యూల్‌..

  1. డిసెంబరు 11వ తేదీ జనరల్ బాడీ సమావేశం.

  2. 12వ తేదీ నోటిఫికేషన్ విడుదల.

  3. 15, 16వ తేదీల్లో నామినేషన్ల స్వీకరణ.

  4. 17వ తేదీ నామినేషన్ల స్క్రూటనీ, సాయంత్రం 5 గంటల వరకు ఉపసంహరణ.

  5. 23వ తేదీ ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం కార్యవర్గం ఎన్నికలు.

  6. అదే రోజు కౌంటింగ్ , గెలుపొందిన అభ్యర్థులను ప్రకటించనున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

జగన్ హయాంలో భూ రికార్డులు తారుమారు .. సీఎం చంద్రబాబు ఫైర్

శ్రీశైలం దేవస్థానం మరో కీలక నిర్ణయం.. వారికి ఉచిత స్పర్శ దర్శనం..

Read Latest AP News and National News

Updated Date - Dec 03 , 2025 | 07:23 PM