AP GOVT: మహిళలకు గుడ్‌న్యూస్.. ఆడబిడ్డ నిధిపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ABN , Publish Date - Jul 22 , 2025 | 04:45 PM
ఆడబిడ్డ నిధిని కూడా త్వరలో ప్రారంభిస్తామని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు.ఆడబిడ్డలకు పెళ్లి, ఉద్యోగం వచ్చే వరకు కూటమి ప్రభుత్వం ఆడబిడ్డ నిధితో అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. చెప్పిన మాట చేసి చూపించే వ్యక్తి చంద్రబాబునాయుడు అని అభివర్ణించారు.

నంద్యాల: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వడివడిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Nara Chandrababu Naidu) అమలు చేస్తున్నారు. సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఆడబిడ్డ నిధి పథకాన్ని(Aadabidda Nidhi Scheme) చంద్రబాబు ప్రకటించారు. ఈ పథకాన్ని కూడా త్వరలోనే అమలు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రతి మహిళకు ఆర్థిక స్వాతంత్య్రం కల్పించడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు ఆడబిడ్డ నిధి పథకానికి రూపకల్పన చేశారు. ఈ పథకంలో భాగంగా ప్రతి మహిళకు కూటమి ప్రభుత్వం నెలకు రూ.1500 అందించనుంది. ఈ పథకం ప్రకారం 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల మధ్య ఉన్న వారికి బ్యాంకు ఖాతాలో రూ.1500 జమ చేయనున్నారు. అయితే ఈ పథకంపై ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి కీలక ప్రకటన చేశారు.
ఆడబిడ్డ నిధిని (Aadabidda Nidhi Scheme) కూడా త్వరలో ప్రారంభిస్తామని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి (Minister Anam Ramanarayana Reddy) తెలిపారు. ఆడబిడ్డలకు పెళ్లి, ఉద్యోగం వచ్చే వరకు కూటమి ప్రభుత్వం ఆడబిడ్డ నిధితో అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. చెప్పిన మాట చేసి చూపించే వ్యక్తి చంద్రబాబునాయుడు అని అభివర్ణించారు. ఇవాళ(మంగళవారం) నంద్యాల జిల్లాలోని గడివేముల మండలం దుర్వేసిలో ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమంలో మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి, శాసన సభ్యురాలు గౌరు చరితా రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడారు. సూపర్ సిక్స్ పథకాలను చాలామంది అవహేళన చేశారని... కాని ప్రజలు విశ్వసించారు, గెలిపించారని ఉద్గాటించారు.
ఆలయాలకు రూ.10 వేలు: మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి
దుర్వేసి గ్రామ ప్రజల కోరిక మేరకు గ్రామంలో సుంకులమ్మ గుడిని నిర్మిస్తామని మాటిచ్చారు. ఆగస్టు 15వ తేదీ నుంచి ఏపీలో ఉచిత బస్సు సౌకర్యం అమలు చేస్తున్నామని మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి స్పష్టం చేశారు. ఆలయాల్లో ధూప దీప, నైవేద్యాలకు పూజారికి ప్రతినెల రూ.10 వేలు ఇవ్వనున్నామని ప్రకటించారు. నంద్యాల జిల్లాలో 47 ఆలయాలకు రూ. 43 కోట్లు కేటాయించామని చెప్పుకొచ్చారు. కాల్వబుగ్గ ఆలయానికి రూ.4కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందని పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో రైతుల పుస్తకాలపై జగన్ ఫొటో వేయించుకున్నారని విమర్శించారు. రైతుల భూములను ప్రభుత్వ భూమి పేరుతో రుణం తీసుకోవాలని వైసీపీ కుట్ర చేసిందని మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి ఆరోపించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
భక్తులకు అలర్ట్.. టీటీడీ కీలక నిర్ణయాలు
వేల కోట్ల భూములు.. ఖరీదైన విల్లాలు.. వెలుగులోకి మాజీ మంత్రి అనిల్ అక్రమాలు
For More AP News and Telugu News