Handri Neva Canal Water Release: హంద్రీ - నీవా కాల్వలకు నీరు విడుదల
ABN , Publish Date - Jul 17 , 2025 | 02:52 PM
Handri Neva Canal Water Release: శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి సీమ జిల్లాలకు వివిధ కాల్వలకు.. రిజర్వాయర్లకు విడుదల చేసిన నీటిని సక్రమంగా వినియోగించుకునేలా ప్రణాళికా బద్ధంగా వ్యవహరించాలని చంద్రబాబు సూచించారు.

నంద్యాల, జులై 17: మల్యాల వద్ద హంద్రీనీవా సుజల స్రవంతి ఎత్తిపోతల పథకం నుంచి మూడు పంపుల ద్వారా నీటిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) విడుదల చేశారు. ఈరోజు (గురువారం) మల్యాల పంపింగ్ స్టేషన్ వద్ద పూజలు నిర్వహించిన అనంతరం స్విచ్ఛాన్ చేసి హంద్రీ - నీవా కాల్వలకు నీటిని విడుదల చేశారు సీఎం. శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి సీమ జిల్లాలకు హంద్రీ - నీవా కాల్వ ద్వారా నీరు విడుదలయ్యాయి. ఆపై మల్యాల పంపింగ్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన ఫొటో గ్యాలరీని ముఖ్యమంత్రి సందర్శించారు.
శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి సీమ జిల్లాలకు వివిధ కాల్వలకు.. రిజర్వాయర్లకు విడుదల చేసిన నీటిని సక్రమంగా వినియోగించుకునేలా ప్రణాళికా బద్ధంగా వ్యవహరించాలని చంద్రబాబు సూచించారు. ఇరిగేషన్ శాఖ అంటే ప్రాజెక్టులు, కాల్వలే కాకుండా భూగర్భ జలాల వినియోగం వంటివి కూడా చూసుకోవాలన్నారు. తిరుపతి వద్ద గాలేరు - నగరి, హంద్రీ - నీవా, సోమశిల - స్వర్ణముఖి కలిసేలా ప్రణాళికలు చేసుకోవాలని సీఎం ఆదేశించారు. సీఎం చంద్రబాబు వెంట మంత్రులు నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్, బీసీ జనార్దన్ రెడ్డి, ఫరూక్, ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
జగన్ వ్యాఖ్యలపై పోలీసు అధికారుల సంఘం ఫైర్
వంశీకి సుప్రీంకోర్టులో చుక్కెదురు
Read Latest AP News And Telugu News