Leopard sighting In Tirupati: తిరుపతిలో కల్వర్టు వద్ద తాపీగా కూర్చున్న చిరుత
ABN , Publish Date - Jul 17 , 2025 | 12:00 PM
Leopard sighting In Tirupati: తిరుపతిలో చిరుత సంచారంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రోడ్డుపై ఉన్న చిరుతను చూసిన వాహనదారులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.

తిరుపతి, జులై 17: తిరుపతిలో (Tirupati) చిరుత పులి (Leopard) సంచారం కలకలం రేపింది. అలిపిరి - జూపార్క్ రోడ్డులో చిరుత సంచరిస్తోంది. ఈరోజు (గురువారం) తెల్లవారుజామున 5:30 గంటల ప్రాంతంలో కల్వర్టు వద్ద చిరుత కనిపించింది. అటవీశాఖ ఏర్పాటు చేసిన ఇనుప కంచె దాటుకుని మరీ చిరుత రోడ్డుపైకి వచ్చింది. రోడ్డుపై చిరుత ఉండటాన్ని చూసిన వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దీంతో చిరుత ఉన్న వైపుకు కాకుండా ఒకే రోడ్డుపై మాత్రమే వాహనదారులు రాకపోకలు సాగించారు. చాలా సేపటి వరకు కూడా చిరుత ఆ ప్రాంతంలోనే తాపీగా కూర్చున్నట్లు సమాచారం. మరోవైపు కొందరు వాహనదారులు చిరుతను తమ మొబైల్‌లో చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్‌గా మారాయి.
కొంత మంది ప్రయాణికులు చిరుత సంచారం గురించి పోలీసులకు, అటవీ శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. గత వారం రోజులుగా ఎస్వీ యూనివర్సిటీ, వేదిక్ యూనివర్సిటీ, అగ్రికల్చరల్ యూనివర్శిటీ పరిసరాలలో చిరుత సంచరిస్తున్నట్లు గుర్తించారు. దీంతో విద్యార్థులు ఆందోళన చెందారు. ఈ క్రమంలో వేదిక్ యూనివర్సిటీ వద్ద ఓ చిరుత బంధించడంతో విద్యార్థులు కాస్త ప్రశాంతంగా ఉన్నారు. తిరిగి ఇప్పుడు మళ్లీ చిరుత సంచారంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చిరుతను బంధించాల్సిగా అటవీ శాఖ అధికారులను కోరుతున్నారు. ఈ క్రమంలో చిరుతను పట్టుకునేందుకు ఫారెస్ట్ అధికారులు బోన్ ఏర్పాటు చేశారు.
ఇవి కూడా చదవండి..
లిక్కర్ కేసులో అసలు బాస్ ఆయనే.. సోమిరెడ్డి హాట్ కామెంట్స్
హైదరాబాద్‌లో అగ్నిప్రమాదం.. ఎగిసిపడ్డ మంటలు
Read Latest AP News And Telugu News