Share News

TDP Buddha Venkanna: విశ్వాసం లేని కుక్క.. ఆ నేతపై బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు..

ABN , Publish Date - Jul 17 , 2025 | 11:38 AM

రాష్ట్రం శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని మాజీ సీఎం జగన్, వారి సైకోలు కుట్రలు చేస్తున్నారని టీడీపీ నేత బుద్దా వెంకన్న ఆరోపించారు. రప్పా రప్పా అంటారా.. మీకు సిగ్గు శరం ఏమైనా ఉందా? అంటూ వారిపై నిప్పులు చెరిగారు. అంతేకాకుండా..

TDP Buddha Venkanna: విశ్వాసం లేని కుక్క.. ఆ నేతపై బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు..
TDP Buddha Venkanna

విజయవాడ: మాజీ మంత్రి పేర్ని నాని, కొడాలి నానిపై టీడీపీ నేత బుద్దా వెంకన్న తీవ్ర విమర్శలు చేశారు. పేర్ని నాని విశ్వాసం లేని కుక్క అంటూ దూషించారు. రేషన్ బియ్యం బొక్కేసింది నిజం కాదా? స్థలాలను కబ్జా చేసింది వాస్తవం కాదా? అంటూ మండిపడ్డారు. దసరా ఉత్సవాల సమయంలో ‌పులి వేషగాళ్లు తరహాలో పేర్ని నాని వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. జగన్ డైరెక్షన్‌లో పేర్ని నాని, కొడాలి నాని, వల్లభనేని వంశీ, జోగి రమేష్ నీచంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


వీరంతా జనాల వద్ద మామూళ్లు వసూళ్లు చేసి‌ కోట్లాది రూపాయలు దోచుకున్న వ్యక్తులు అని నిప్పులు చెరిగారు. రప్పా రప్పా అంటారా.. మీకు సిగ్గు శరం ఏమైనా ఉందా? అని తీవ్ర విమర్శలు చేశారు. మా నాయకుడు అరగంట సమయం ఇస్తే మీ సంగతి ఏమిటో తేలుస్తామని బుద్దా వెంకన్న సీరియస్ అయ్యారు. మీ అరాచకాలను అడ్డుకుని ధైర్యంగా నిలబడ్డ వ్యక్తులం తామని, మీలాగా డబ్బులు పుచ్చుకుని‌ నోరు పారేసుకునే వాళ్లం కాదని అన్నారు. మా నాయకుడి కోసం మా ప్రాణాలు అయినా ఇస్తామని వ్యాఖ్యానించారు.

ఇంకొక సారి చంద్రబాబు, లోకేష్ లను అవమానంగా మాట్లాడితే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. జగన్ ఇప్పుడు బిసిల మీద కపట ప్రేమ చూపుతున్నాడని, మాచర్లలో నా మీద దాడి జరిగితే అప్పుడు బీసిలు గుర్తు లేదా? అని ప్రశ్నించారు. నా పై దాడి చేసిన కిషోర్‌కు మున్సిపల్ ఛైర్మన్ ఇచ్చారని అన్నారు. చంద్రయ్యను దారుణంగా చంపితే హంతకులను అరెస్టు చేయలేదే? ఇప్పుడు నువ్వా బీసీల గురించి మాట్లాడేది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.


డీజీపీ ఆధ్వర్యంలో ఏపీలో‌ లా అండ్ ఆర్డర్ సక్రమంగా నడుస్తుందని, అటువంటి వ్యక్తిని డాన్ అంటావా అంటూ నిప్పులు చెరిగారు. పీఎస్సార్ ఆంజనేయులు అరాచకాలు మీకు‌ కనిపించ‌ లేదా? ఉండవల్లికి పీఎస్సార్ మంచోడు అంట.. ఎలా మంచోడో చెప్పాలని ప్రశ్నించారు. చంద్రబాబు ఇంటి మీదకు వచ్చిన జోగి రమేష్‌కి మంత్రి పదవి ఇచ్చావు.. అడ్డుకున్న మా‌మీద కేసులు పెట్టావని మాజీ మంత్రి జగన్‌పై బుద్దా వెంకన్న మండిపడ్డారు. 175 నావే అన్న మీకు.. ప్రజలు కేవలం 11 సీట్లు ఇచ్చారని ఎద్దేవ చేశారు. ఇప్పుడు మీ సభలకు వచ్చేది కేవలం పిల్ల సైకోలు మాత్రమేనని, ప్రజలు ఎవ్వరూ మీ ముఖం‌ చూడటానికి కూడా ఇష్ట పడటం లేదని కామెంట్స్ చేశారు. కనీసం ఇంట్లోకి బీసీ, ఎస్సీ, ఎస్టీలను ఎప్పుడైనా రానిచ్చావా? అంటూ ప్రశ్నించారు.


రాష్ట్రం శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని జగన్, సైకోలు కుట్రలు చేస్తున్నారని అన్నారు. పెట్టుబడులు అడ్డుకోవాలని చూస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు లాగా పని చేసే దమ్ము మీలో ఎవరికైనా ఉందా? ఢిల్లీలో అందరినీ‌ కలిసి ఆ వివరాలు ప్రజలకు చెబుతున్నారు. మీ జగన్ ఢిల్లీ వెళ్ళి ఒక్కసారైనా ఏం చర్చ చేశారో చెప్పారా? చంద్రబాబు, లోకేష్ ల‌పై అనవసరంగా నోరు పారేసుకుంటే వారికి తగిన రీతిలో బుద్ది చెబుతామని బుద్దా వెంకన్న హెచ్చరించారు. చంద్రబాబు కృషి వల్ల ఏపీకి అనేక మంది పెట్టుబడి దారులు వస్తున్నారన్నారు. పరిశ్రమలు ఏర్పాటు కోసం చాలా మంది ప్రభుత్వంపై నమ్మకంతో వచ్చారని, ఈ పరిస్థితుల్లో వంశీ నివాసంలో వారంతా కలిసి రాష్ట్రంలో అల్లర్లు చేసేందుకు కుట్రలు చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. శాంతి భద్రతలకు విఘాతం‌ కలిగిస్తే పెట్టుబడులు రావని వైసీపీ సైకోలు నీచంగా ఆలోచన చేస్తున్నారన్నారు.


Also Read:

అనగనగా ఒక ఊరు.. ప్రజలే లేరు..!

లిక్కర్ కేసులో అసలు బాస్ ఆయనే.. సోమిరెడ్డి హాట్ కామెంట్స్

For More Andhra Pradesh News

Updated Date - Jul 17 , 2025 | 11:49 AM