Trains Schedule: రైళ్ల పాక్షిక రద్దు... గమ్యాల కుదింపు
ABN , Publish Date - Jul 17 , 2025 | 09:40 AM
Trains Schedule: కేకే లైనులో సాంకేతిక కారణాల వల్ల రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో కిరండూల్ రైళ్లతోపాటు హిరాకుడ్, సమలేశ్వర్, ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రైళ్లను పాక్షికంగా రద్దు చేయడంతోపాటు కొరాపుట్ వరకే నడిపిస్తున్నామని సీనియర్ డీసీఎం కె. సందీప్ తెలిపారు.

విశాఖపట్నం, జూలై 16 (ఆంధ్రజ్యోతి): కేకే లైనులో సాంకేతిక కారణాల వల్ల రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో కిరండూల్ రైళ్లతోపాటు హిరాకుడ్, సమలేశ్వర్, ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రైళ్లను (Trains) పాక్షికంగా రద్దు చేయడంతోపాటు కొరాపుట్ వరకే నడిపిస్తున్నామని సీనియర్ డీసీఎం కె. సందీప్ తెలిపారు. విశాఖ-కిరండూల్ రాత్రి ఎక్స్ ప్రెస్ (18515) ఈ నెల 18 వరకు విశాఖలో బయలుదేరి కొరాపుట్ వరకు నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో కిరండూల్- విశాఖ ఎక్స్ప్రెస్ ఈ నెల 17 నుంచి 19 వరకు కొరాపుట్లో బయలుదేరి విశాఖ చేరుతుంది. కొరాపుట్-కిరండూల్ (Koraput-Jagdalpur-Kirandul railway) మధ్య రాకపోకలు రద్దు చేశారు.
17, 18 తేదీల్లో...
అలాగే విశాఖ-కిరండూల్ పాసింజర్ (58501) ఈ నెల 17, 18 తేదీల్లో విశాఖలో బయలుదేరి కొరాపుట్ వరకు, తిరుగు ప్రయాణంలో ఇదే తేదీల్లో పాసింజర్ (58502) రైలు కొరాపుట్లో బయలుదేరి విశాఖ చేరుతుంది. హౌరా-జ గదల్పూర్ సమలేశ్వర్ ఎక్స్ ప్రెస్ (18005) ఈ నెల 17న హౌరాలో బయలుదేరి కొరాపుట్ వరకు నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో ఇదే ఎక్స్ప్రెప్రెస్ (18006) ఈ నెల 18, 19లలో కొరాపుట్లో బయలుదేరి హౌరా చేరుతుంది. కొరాపుట్-జగదల్ పూర్ మధ్య రాకపోకలను రద్దు చేశారు.
రౌర్కెలా-జగదల్పూర్ ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ (18107) ఈ నెల 17న రౌర్కెలాలో బయలుదేరి కొరాపుట్ వరకు, తిరుగు ప్రయాణంలోని ఇంటర్సిటీ (18108) ఈ నెల 17, 18లలో కొరాపుట్లో బయలుదేరి రౌర్కెలా చేరుతుంది. ఈ సర్వీసులకు కొరాపుట్- జగదల్పూర్ మధ్య రాకపోకలు రద్దు చేశారు. భువనేశ్వర్-జగదల్పూర్ హిరాకుడ్ ఎక్స్ ప్రెస్ (18447) ఈ నెల 17న భువనేశ్వర్ బయలుదేరి కొరాపుట్ వరకు, తిరుగు ప్రయాణంలో ఇదే ఎక్స్ప్రెస్ (18448) ఈ నెల 17, 18లలో కొరాపుట్ నుంచి బయలుదేరి భువనేశ్వర్ చేరుతుంది. ఈ సర్వీసులకు కొరాపుట్ జగదల్పూర్ మధ్య రాకపోకలు రద్దు చేసినట్లు డీసీఎం పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
తాటి చెట్టే లేదు.. లక్షల లీటర్ల కల్లా..