Share News

TDP MLA Cries: కన్నీళ్లు పెట్టుకున్న టీడీపీ ఎమ్మెల్యే!

ABN , Publish Date - Jul 17 , 2025 | 12:30 PM

TDP MLA Cries: మైలవరం ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ వ్యక్తిగత కార్యదర్శి కట్టా నరసింహరావు మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న కృష్ణ హైదరాబాద్ నుంచి నక్కలంపేటకు చేరుకున్నారు. నరసింహరావు భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నరసింహరావు మృతదేహాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు ఎమ్మెల్యే.

TDP MLA Cries: కన్నీళ్లు పెట్టుకున్న టీడీపీ ఎమ్మెల్యే!
TDP MLA Vasantha venkata Krishna Prasad

మైలవరం, జులై 17: మైలవరం (Mylavaram) టీడీపీ (TDP) ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ (Vasantha venkata Krishna Prasad) కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆయన వ్యక్తిగత కార్యదర్శి కట్టా నరసింహరావు ఆకస్మిక మృతి చెందారు. నరసింహరావు మృతదేహాన్ని చూసి ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ చలించిపోయారు. హైదరాబాద్ (Hyderabad) నుంచి కుటుంబ సభ్యులతో వచ్చి నక్కలంపేటలో కట్టా నరసింహరావు భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నరసింహ రావు మృతి పట్ల తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన కృష్ణ ప్రసాద్, బాధను తట్టుకోలేక కన్నీటి పర్యంతమయ్యారు.

వార్త అప్డేట్ చేయబడుతోంది...


Also Read:

అనగనగా ఒక ఊరు.. ప్రజలే లేరు..!

లిక్కర్ కేసులో అసలు బాస్ ఆయనే.. సోమిరెడ్డి హాట్ కామెంట్స్

Updated Date - Jul 17 , 2025 | 12:31 PM