Sujana Chowdary: మోదీ టార్గెట్ ఇదే.. సుజనా చౌదరి కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Apr 06 , 2025 | 11:58 AM
Sujana Chowdary: పదేళ్ల నుంచి దేశం కోసం ప్రధానమంత్రి నరేంద్రమోదీ కష్టపడుతున్నామని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి తెలిపారు. ప్రపంచంలో ఎక్కువ మంది కార్యకర్తలు కలిగిన పార్టీ బీజేపీ అని సుజనా చౌదరి చెప్పారు.

విజయవాడ: దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎంతగానో కృషి చేస్తున్నారని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి వ్యాఖ్యానించారు. ఇవాళ (ఆదివారం) బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. బీజేపీ జెండాను ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆవిష్కరించారు. ఈ వేడుకల కోసం భారీగా బీజేపీ కార్యకర్తలు, నాయకులు తరలి వచ్చారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి మీడియాతో మాట్లాడారు. 1980లో జనసంఘ్ నుంచి చాలా ఒడిదుడుకులను తట్టుకుని భారతీయ జనతా పార్టీ నిలబడిందని తెలిపారు. ప్రపంచంలో ఎక్కువ మంది కార్యకర్తలు కలిగిన పార్టీ బీజేపీ అని చెప్పారు. రెండు సీట్ల నుంచి ప్రారంభమై మూడు వందలకుపైగా సీట్లు కమలం పార్టీకి రావడం చాలా గొప్ప విశేషమని సుజనా చౌదరి అభివర్ణించారు.
పదేళ్ల నుంచి భారతదేశం కోసం ప్రధానమంత్రి నరేంద్రమోదీ చాలా కష్టపడుతున్నామని సుజనా చౌదరి తెలిపారు. దేశాన్ని నరేంద్ర మోదీ నాయకత్వంలో మరింత ముందుకు తీసుకెళ్తామని ఉద్ఘాటించారు. వాజ్ పాయ్, అద్వానీ లాంటి నేతల నుంచి నేడు నరేంద్రమోదీ, అమిత్ షా లాంటి సమర్థవంతమైన నాయకులు కలిగిన పార్టీ బీజేపీ అని చెప్పారు. నేడు దేశ వ్యాప్తంగా ఘనంగా బీజేపీ ఆవిర్భావ వేడుకలు జరగటం గొప్ప విషయమని తెలిపారు. ఈ సందర్భంగా దేశ ప్రజలందరికి ఎమ్మెల్యే సుజనా చౌదరి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఒంటిమిట్లలో వైభవంగా శ్రీరామనవమి వేడుకలు
Sri Rama Navami: జగదభి రాముడు శ్రీరాముడు
For More AP News and Telugu News