Share News

Bode Prasad Vs Perni Nani: పేర్నినాని అక్కడికి వెళ్లు.. నీ రప్పా..రప్పా సంగతి వాళ్లే చూస్తారు: బోడె ప్రసాద్

ABN , Publish Date - Jul 12 , 2025 | 04:15 PM

Bode Prasad Vs Perni Nani: చీకట్లో కన్ను కొడితే.. తలలు నరికేయండి అని కృష్ణా జిల్లా వైసీపీ అధ్యక్షులు పేర్ని నాని చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే బోడె ప్రసాద్ మండిపడ్డారు. చంద్రబాబు అభివృద్ధి – సంక్షేమం చేసి ప్రజల మన్ననలు పొందాలని పదేపదే చెప్తూ ఉంటారన్నారు.

Bode Prasad Vs Perni Nani: పేర్నినాని అక్కడికి వెళ్లు.. నీ రప్పా..రప్పా సంగతి వాళ్లే చూస్తారు: బోడె ప్రసాద్
Bode Prasad Vs Perni Nani

అమరావతి, జులై 12: ప్రజాస్వామ్యాన్ని అంతం చేసేందుకు వైసీపీ శ్రేణులు కుట్రలు చేస్తున్నారని ఎమ్మెల్యే బోడె ప్రసాద్ (MLA Bode Prasad) విమర్శలు గుప్పించారు. శనివారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రజాప్రతినిధులు చేసే ప్రతీ పనిని ప్రజలు నిశితంగా గమనిస్తారన్నారు. తప్పు జరిగితే క్షమించను అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) పదే పదే చెబుతున్నారని గుర్తు చేసిన ఎమ్మెల్యే.. వైసీపీ నేతలు మాత్రం విధ్వంసమే పరమావధిగా ప్రవర్తిస్తున్నారని దుయ్యబట్టారు. రెంటపాళ్లలో వైసీపీ కార్యకర్త రప్పా.. రప్పా.. అని ప్లకార్డు పట్టుకుంటే.. మీడియా సమక్షంలో దానిని సమర్ధించారంటే జగన్ రెడ్డి మానసిక పరిస్థితి ఎలా ఉందో అర్థం అవుతోందని ఎద్దేవా చేశారు. ఒక పార్టీ అధ్యక్షుడిగా, మాజీ సీఎంగా ప్రజాప్రతినిధులకు ఇచ్చే స్ఫూర్తి ఇదేనా అని జగన్ రెడ్డిని ఎమ్మెల్యే ప్రశ్నించారు.


‘చీకట్లో కన్ను కొడితే.. తలలు నరికేయండి’ అని కృష్ణా జిల్లా వైసీపీ అధ్యక్షులు పేర్ని నాని చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే బోడె ప్రసాద్ తీవ్రంగా మండిపడ్డారు. చంద్రబాబు అభివృద్ధి – సంక్షేమం చేసి ప్రజల మన్ననలు పొందాలని పదేపదే చెప్తూ ఉంటారన్నారు. కానీ వైసీపీ వారు మాత్రం హత్యలు చేయండి.. తలలు నరకండని చెప్తున్నారంటే వారి పార్టీ ఆలోచనలు, నాయకుల మానసిక పరిస్థితి ఏ రకంగా ఉందో అర్థమవుతుందన్నారు. హింస, విధ్వంసం వైసీపీ పాలసీ అని పేర్నినాని వ్యాఖ్యల ద్వారా మరోసారి స్పష్టమైందని ఎమ్మెల్యే విమర్శించారు.


రప్పా.. రప్పా.. నరికేస్తాం.. అనేది వైసీపీ తీసుకువచ్చిన రాజారెడ్డి రాజ్యాంగమని విరుచుకుపడ్డారు. కూటమి ప్రభుత్వంలో అంబేద్కర్ రాజ్యాంగం అమలవుతోందని స్పష్టం చేశారు. రేషన్ బియ్యం, అక్రమ మైనింగ్, భూ దందా, అవినీతి సొమ్ముతో పేర్ని నాని విర్రవీగి వ్యవహరిస్తున్నారని.. ఎన్నికల ఫలితాలను గుర్తు చేసుకోవాలని హితవుపలికారు. గత ప్రభుత్వ పాలనలో బీచ్ రోడ్డులో పూరి గుడిసెలకు నిప్పు పెట్టడం, ప్రజా రక్షణ కోసం పని చేసే పోలీస్ స్టేషన్‌‌పై దాడి చేయడం అనేది నిజమా..? కాదా..? అని ప్రశ్నించారు. ‘రప్పా.. రప్పా అని టీవీల ముందు కాదు.. మచిలీపట్నంలో నువ్వు అక్రమించిన వెయ్యి గజాల తమ్మిన వారి సత్రం దగ్గర కానీ, నువ్వు కబ్జా చేసిన కోటా జయరాం పొలం వద్ద కానీ, రంగనాయక స్వామి గుడి దగ్గరకు కానీ వెళ్తే అక్కడి స్థానికులు నీ రప్పా.. రప్పా.. సంగతి చెప్తారు’ అంటూ బోడె ప్రసాద్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.


ఇవి కూడా చదవండి..

అర్చక నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన మంత్రి ఆనం

ఆ ఇద్దరి మాటలు జగన్ అంతరంగంలోనివే: దేవినేని

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 12 , 2025 | 05:02 PM