Rammohan Naidu: ప్రతిష్టాత్మకంగా రోజ్‌గార్ మేళా
ABN , Publish Date - Jul 12 , 2025 | 02:16 PM
అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి సంబంధించి ఏఏఐబీ ప్రాథమిక నివేదిక వచ్చిందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ప్రాథమిక నివేదిక ద్వారా ప్రమాదానికి గల కారణాలను నిర్ధారించలేమని తెలిపారు. ఈ ప్రమాదంపై పూర్తిస్థాయి నివేదిక వచ్చిన తర్వాత వివరాలను వెల్లడిస్తామని అన్నారు.

విశాఖపట్నం: రోజ్‌గార్ మేళాను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు (Union Minister Rammohan Naidu) ఉద్ఘాటించారు. ఒక రికార్డ్‌లా రోజ్‌గార్ మేళా కార్యక్రమం ముందుకు సాగుతోందని చెప్పుకొచ్చారు. ప్రధాని మోదీ దేశం కోసం నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రపంచంలో భారత్ నాల్గో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని ఉద్ఘాటించారు. ఇవాళ(శనివారం) విశాఖపట్నంలోని సాగర్ మాలా కన్వెన్షన్ సెంటర్‌లో రోజ్‌గార్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రామ్మోహన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రోజ్‌గార్ మేళాలో పాల్గొన్న 52 మందికి నియామక పత్రాలు అందజేశారు. ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, వాల్తేర్ డివిజన్ డీఆర్ఎం లలిత్ బొహ్రా, రైల్వే అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రామ్మోహన్ మీడియాతో మాట్లాడారు. ఈరోజు విశాఖలో రోజ్‌గార్ మేళాలో 52 మందికి ఉద్యోగ నియామక పాత్రలు అందజేశామని తెలిపారు. మూలపేట నుంచి భోగాపురం వరకు తీర ప్రాంతం గుండా రోడ్డు మంజూరు కావడం శుభపరిణామమని అన్నారు. ఆ రోడ్డు ప్రస్తుతం డీపీఆర్ స్టేజ్‌లో ఉందని తెలిపారు. ఈ రోడ్డు ఉత్తరాంధ్ర జిల్లాలకు ఎంతగానో ఉపయోగపడుతోందని చెప్పారు. త్వరలో ఆ రోడ్డు పనులు ప్రారంభించడానికి తమవంతుగా కృషి చేస్తామని అన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు శరవేగంగా సాగుతున్నాయని పేర్కొన్నారు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు.
అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి సంబంధించి ఏఏఐబీ ప్రాథమిక నివేదిక వచ్చిందని తెలిపారు. ప్రాథమిక నివేదిక ద్వారా ప్రమాదానికి గల కారణాలను నిర్ధారించలేమని చెప్పారు. ఈ ప్రమాదంపై పూర్తిస్థాయి నివేదిక వచ్చిన తర్వాత వివరాలను వెల్లడిస్తామని అన్నారు. విమాన ప్రమాద బాధితులకు తప్పకుండా న్యాయం జరుగుతుందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మాజీ ఎంపీ ట్వీట్.. ఈ పోస్ట్‌కు అర్థమేమి సాయిరెడ్డి
ఒక్కసారిగా కుప్పకూలిన 4 అంతస్తుల భవనం.. శిథిలాల కింద జనం..
Read Latest AP News And Telugu News