DBV Swamy: ఏపీలో వైసీపీ నేతలు శాంతి భద్రతలకు భంగం కలిగిస్తున్నారు.. మంత్రి డీబీవీ స్వామి ఫైర్
ABN , Publish Date - Jul 12 , 2025 | 03:41 PM
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రప్పా రప్పా అనడంలో ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా మీ భాషా అదేనా అని మంత్రి డీబీవీ స్వామి ప్రశ్నించారు.

పార్వతీపురం (మన్యం జిల్లా): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి (Minister Bala Veeranjaneya Swamy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రప్పా రప్పా అనడంలో ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా మీ భాషా అదేనా అని ప్రశ్నించారు. వైసీపీని ప్రజలు ఎప్పుడో మానసికంగా నరికి అవతల పడేశారని విమర్శించారు. ఇవాళ(శనివారం) మన్యం జిల్లాలో మంత్రి పర్యటించారు. మన్యం జిల్లా కేంద్రంలో ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమంలో మంత్రి డీబీవీ స్వామి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే బొనేల విజయచంద్ర, కూటమి నేతలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి బాల వీరాంజనేయ స్వామి మాట్లాడారు. యథా రాజా తథా ప్రజా అనే చందంగా ఈరోజు రాష్ట్రంలో విపక్ష పార్టీ వైసీపీ పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. ప్రజలు వైసీపీని ఎప్పుడో చీత్కారించారని అయినా ఆ పార్టీ నేతల్లో మార్పు రావడం లేదని మండిపడ్డారు. జగన్‌కి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా.. 151 నుంచి 11 సీట్లకు పడిపోతే వారి పరిస్థితి ఇంకా అర్థం కావడం లేదని విమర్శించారు. పదిమంది కలిసి గుంపులుగా వెళ్లి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఏపీలో శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ నేతలు కారకులు అవుతున్నారని మంత్రి బాల వీరాంజనేయ స్వామి మండిపడ్డారు.
వైసీపీ నేతలకి ఇంకా బుద్ది రావడం లేదు: కొనకళ్ల నారాయణ
గత ఎన్నికల ఫలితాల్లో జగన్ మోహన్ రెడ్డి నిరంకుశ, అవినీతి పరిపాలనకు ప్రజలు గుణపాఠం చెప్పి.. ప్రతిపక్ష హోదా దక్కకుండా.. ఘోరంగా ఓడించారని.. అయినా వారికి బుద్ధి రావడం లేదని ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ విమర్శించారు. ఇవాళ(శనివారం) అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో కొనకళ్ల నారాయణ మీడియాతో మాట్లాడారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కనీవినీ ఎరుగని రీతిలో కూటమి ప్రభుత్వానికి అత్యంత అధిక మెజార్టీతో అధికారాన్ని ప్రజలు ఇచ్చారని ఉద్ఘాటించారు కొనకళ్ల నారాయణ.
వైసీపీ నేతలు ఓడిపోయిన అవమానంతో, అసూయతో కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రప్పా.. రప్పా.. చీకట్లో కన్నుకొడితే పని అయిపోవాలని.. తలలు లేచిపోవాలని మాజీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు దేనికి సంకేతమని ప్రశ్నించారు. మాజీ మంత్రిగా, జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న పేర్ని నాని ప్రజాస్వామ్యన్ని రక్షించే విధంగా మాట్లాడాలని.. కానీ, హింసను ప్రేరేపించే విధంగా మాట్లాడటం దారుణమని అన్నారు కొనకళ్ల నారాయణ.
ఆంధ్రప్రదేశ్‌లో అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తోందని చెప్పుకొచ్చారు. సీఎం చంద్రబాబు సారథ్యంలో ఉన్న కూటమి ప్రభుత్వంలో హింసను ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రొత్సహించరని స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో జగన్ రెడ్డి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తూ.. ఏపీని అవినీతిమయంగా, ఆరాచకంగా మార్చారని ధ్వజమెత్తారు. గతంలో టీడీపీ నాయకులపై, కార్యకర్తలపై వైసీపీ నేతలు దాడులు చేసి, హత్యలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అది వైసీపీ సంస్కృతిని అందుకనే ప్రజలు మీకు తగిన గుణపాఠం చెప్పారని కొనకళ్ల నారాయణ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
టీటీడీపై ఇంత బండ వేస్తారా.. బండి సంజయ్‌పై భూమన ఆగ్రహం
ఈరోజు రాలేను.. సిట్‌కు విజయసాయి సమాచారం
Read Latest AP News And Telugu News