Devineni Uma vs Jagan: ఆ ఇద్దరి మాటలు జగన్ అంతరంగంలోనివే: దేవినేని
ABN , Publish Date - Jul 12 , 2025 | 03:05 PM
Devineni Uma vs Jagan: సొంత కార్యకర్త సింగయ్యను కారుతో తొక్కించిన జగన్ రెడ్డి తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి సింగయ్య భార్యను బెదిరించి తప్పుడు ప్రకటన ఇప్పించారని దేవినేని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో విద్వేషాలు, వైషమ్యాలు రెచ్చగొట్టాలన్నదే జగన్ వ్యూహకర్తల పన్నాగమని ఆరోపించారు.

అమరావతి, జులై 12: 151 సీట్ల మదంతో జగన్ చేసిన దుర్మార్గాలకు 11 సీట్లతో ప్రజలు లేవకుండా చేశారని మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు (Devineni Umamaheshwar Rao) వ్యాఖ్యలు చేశారు. ఈరోజు (శనివారం) మీడియాతో మాట్లాడుతూ.. చీకట్లో కన్ను కొట్టే తప్పుడు పనులు చేయబట్టే ప్రజలు తగిన బుద్ధి చెప్పారని అన్నారు. వైసీపీ కార్యకర్తలను రెచ్చగొట్టి బలి చేసేందుకే గవర్నమెంట్ వచ్చాక సైలెంట్‌గా వేసెయ్యాలంటూ మాజీ మంత్రి పేర్ని నాని (Former Minister Perni Nani) పిచ్చి ప్రేలాపనలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రధాన మంత్రి కార్యాలయానికి బాంబే స్టాక్‌కు దేశ విదేశాల్లో ఉన్న వైసీపీ కార్యకర్తలతో తప్పుడు మెయిల్స్ పెట్టించి పెట్టుబడులు రాకూడదని కుట్రలు చేశారని విమర్శించారు. జగన్ ఎన్ని కుట్రలు చేసినా ముఖ్యమంత్రి చంద్రబాబుపై (CM Chandrababu) నమ్మకంతో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారని ఆయన వెల్లడించారు.
సొంత కార్యకర్త సింగయ్యను కారుతో తొక్కించిన జగన్ రెడ్డి తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి సింగయ్య భార్యను బెదిరించి తప్పుడు ప్రకటన ఇప్పించారని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో విద్వేషాలు, వైషమ్యాలు రెచ్చగొట్టాలన్నదే జగన్ వ్యూహకర్తల పన్నాగమని ఆరోపించారు. సోదరి వరస అయ్యే మహిళా ఎమ్మెల్యే పట్ల ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఖండించకుండా జగన్ సమర్థించారన్నారు. జగన్ రెడ్డి అంతరంగంలో ఉన్న మాటలే ప్రసన్న కుమార్ రెడ్డి, పేర్ని నాని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చంద్రయ్య గొంతు కోసినందుకే కదా ఈ దుస్థితి పట్టిందని కామెంట్స్ చేశారు.
‘కర్మ ఫలం అనుభవిస్తున్నామంటూ విజయసాయిరెడ్డి భగవద్గీత శ్లోకాలు బోధిస్తున్నారు. సిట్ విచారణలో నీ దగ్గర పనిచేసిన అధికారులే నీ గుట్టు విప్పుతున్నారు’ అని అన్నారు. శాసనసభపై, అంబేద్కర్ రాజ్యాంగంపై గౌరవం లేకుండా ఇష్టానుసారం ప్రవర్తిస్తే ప్రజలు హర్షించరు జగన్ రెడ్డి అని హెచ్చరించారు. పేర్ని నాని అభ్యంతరకర వ్యాఖ్యలపై పోలీస్ యంత్రాంగం సుమోటోగా కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర్ రావు డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి..
టీటీడీపై ఇంత బండ వేస్తారా.. బండి సంజయ్‌పై భూమన ఆగ్రహం
ఈరోజు రాలేను.. సిట్‌కు విజయసాయి సమాచారం
Read Latest AP News And Telugu News