Vijayasai Reddy Tweet: మాజీ ఎంపీ ట్వీట్.. ఈ పోస్ట్‌కు అర్థమేమి సాయిరెడ్డి
ABN , Publish Date - Jul 12 , 2025 | 10:29 AM
Vijayasai Reddy Tweet: మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసింది. మద్యం కుంభకోణం కేసులో నేడు విచారణకు రావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొంది.

విశాఖపట్నం, జులై 12: మద్యం కుంభకోణం కేసులో (AP Liquor Case) ఏ5 నిందితుడు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి (Former MP Vijayasaireddy) సిట్ (SIT) నోటీసులు జారీ చేసింది. ఈరోజు (శనివారం) ఉదయం 10 గంటలకు విజయవాడలోని సిట్ కార్యాలయానికి రావాల్సిందిగా సిట్ నోటీసుల్లో పేర్కొంది. సిట్ నోటీసులతో రెండో సారి సిట్ ముందుకు విజయసాయి రానున్నారు. ఇదిలా ఉండగా.. సిట్ నోటీసుల నేపథ్యంలో వైసీపీ మాజీ ఎంపీ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఆసక్తికరమైన పోస్టు చేశారు. ‘కర్మణ్యే వాధికారస్తే’ అంటూ భగవద్గీత శ్లోకాన్ని తన ట్విట్టర్ ఖాతాలో మాజీ ఎంపీ పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ ట్వీట్ సంచలనంగా మారింది.
విజయసాయిరెడ్డి ట్వీట్
‘కర్మణ్యే వాధికారస్తే
మాఫలేషు కదాచన!
మా కర్మఫలహేతుర్భూ:
మా తేసంగోஉస్త్వకర్మణి!!
కర్మలను ఆచరించుట యందే నీకు అధికారము కలదు
కానీ వాని ఫలితముల మీద లేదు.
నీవు కర్మఫలములకు కారణం కారాదు.
అట్లని కర్మలను చేయుట మానరాదు’ శ్రీ శ్రీ భగవద్గీత అంటూ విజయసాయిరెడ్డి పోస్ట్ చేశారు.
కాగా.. ఈ కేసుకు సంబంధించి గత ఏప్రిల్ 18న విజయసాయిని సిట్ విచారించిన విషయం తెలిసిందే. విజయసాయి సమాచారంతో లిక్కర్ కేసు విచారణలో కదిలిక వచ్చింది. తాను విజిల్ బ్లోయర్‌నంటూ చెప్పుకున్నారు మాజీ ఎంపీ. లిక్కర్ స్కాంలో తనకు తెలిసినవన్నీ చెబుతానన్నారు. ఈ క్రమంలో నేడు విజయసాయిరెడ్డి విచారణతో వైసీపీ నేతల్లో భయం నెలకొంది. ఈసారి ఎవరి పేరు చెపుతారో అని ఆందోళన చెందుతున్న పరిస్థితి. ఇప్పటికే మద్యం కేసులో రాజ్ కేశిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు మరో 9 మంది అరెస్ట్ అయ్యారు. వీరికి ఇంకా బెయిల్ లభించలేదు. చెవిరెడ్డి అరెస్ట్‌తో ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అలాగే చెవిరెడ్డి అనుచరులు ఇద్దరినీ మధ్యప్రదేశ్‌లో సిట్ అధికారులు అరెస్ట్ చేశారు.
ఇవి కూడా చదవండి..
ఒక్కసారిగా కుప్పకూలిన 4 అంతస్తుల భవనం.. శిథిలాల కింద జనం..
ఫోన్ పోగొట్టుకున్నారా.. వెంటనే ఈ ఐదు పనులు చేయండి
Read Latest AP News And Telugu News