Share News

Central Govt Compliance: చట్టాల మార్పు చేర్పుల్లో ఏపీ ఫస్ట్‌

ABN , Publish Date - Jul 12 , 2025 | 06:50 AM

దేశంలో డీ రెగ్యులేషన్‌, కంప్లయన్స్‌ రిడక్షన్‌కు అనుగుణంగా చట్టాల్లో మార్పులు చేయడంలో ఆంధ్రప్రదేశ్‌ ముందుందని కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి(కోఆర్డినేషన్‌) మనోజ్‌గోవిల్‌ వెల్లడించారు.

Central Govt Compliance: చట్టాల మార్పు చేర్పుల్లో ఏపీ ఫస్ట్‌

  • కేంద్ర కార్యదర్శి మనోజ్‌గోవిల్‌

అమరావతి, జూలై 11(ఆంధ్రజ్యోతి): దేశంలో డీ రెగ్యులేషన్‌, కంప్లయన్స్‌ రిడక్షన్‌కు అనుగుణంగా చట్టాల్లో మార్పులు చేయడంలో ఆంధ్రప్రదేశ్‌ ముందుందని కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి(కోఆర్డినేషన్‌) మనోజ్‌గోవిల్‌ వెల్లడించారు. వివిధ ప్రభుత్వశాఖల చట్టాల సరళీకరణలో భాగంగా సులభతర వాణిజ్యం కింద డీ రెగ్యులేషన్‌, కంప్లయెన్స్‌ రిడక్షన్‌ అంశాలపై శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ నేతృత్వంలో సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. సులభతర వాణిజ్యంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ చట్టాలకు అనుగుణంగా పాత చట్టాల్లో మార్పుచేర్పులు, సరళీకరణ ద్వారా ప్రజలకు ఉపయోగపడేలా మెరుగైన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. సీఎస్‌ విజయానంద్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ జన్‌ విశ్వాస్‌ చట్టానికి అనుగుణంగా రాష్ట్ర చట్టాల్లో మార్పులు చేపట్టి, చట్టాల సరళీకరణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.

Updated Date - Jul 12 , 2025 | 09:51 AM