Minister Anam: తిరుమల ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక ప్రణాళిక: మంత్రి ఆనం
ABN , Publish Date - Jul 12 , 2025 | 09:10 AM
శ్రీవారి భక్తులకు మరింత మెరుగైన సేవలను అందిచ్చే విధంగా తమ ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక చేపడుతోందని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. టీటీడీలో పనిచేస్తున్న పలు విభాగాల్లోని ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం శనివారం సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తున్నామని వెల్లడించారు.

తిరుమల: శ్రీవారి భక్తులకు మరింత మెరుగైన సేవలను అందిచ్చే విధంగా తమ ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక చేపడుతోందని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి (Minister Anam Ramanarayana Reddy) తెలిపారు. టీటీడీలో పనిచేస్తున్న పలు విభాగాల్లోని ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఇవాళ(శనివారం) సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం మీడియాతో మాట్లాడారు.
తిరుమల ప్రక్షాళనలో భాగంగా సీఎం చంద్రబాబు సూచనల మేరకు ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నామని చెప్పుకొచ్చారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామని.. ముఖ్యమంత్రి ఆమోదం పొందిన తర్వాత నిర్ణయాలను అమలు చేస్తామని అన్నారు. ఏపీలోని 160 ఆలయాల్లో దర్శనం సులభతరం చేయడంతో పాటు నాణ్యమైన ప్రసాదాలను భక్తులకు అందజేస్తున్నామని ఉద్ఘాటించారు. 200కు పైగా ఆలయాల పునర్ నిర్మాణం కోసం కామన్ వెల్ఫేర్ ఫండ్ నుంచి నిధులు మంజూరు చేశామని స్పష్టం చేశారు. 300 ఆలయాలకు ధూప, దీప, నైవేద్యాలకు నిధులు మంజూరు చేశామని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అప్పు తీసుకొని రాజధాని నిర్మాణమా..
For More Andhra Pradesh News and Telugu News..