Share News

Vijayasai Reddy SIT Inquiry: ఈరోజు రాలేను.. సిట్‌కు విజయసాయి సమాచారం

ABN , Publish Date - Jul 12 , 2025 | 12:27 PM

Vijayasai Reddy SIT Inquiry: ఏపీ లిక్కర్ స్కాంలో సిట్ విచారణకు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి డుమ్మాకొట్టారు. తాను విచారణకు రాలేనంటూ సిట్ అధికారులకు మాజీ ఎంపీ సమాచారం ఇచ్చారు.

Vijayasai Reddy SIT Inquiry: ఈరోజు రాలేను.. సిట్‌కు విజయసాయి సమాచారం
Vijayasai Reddy SIT Inquiry

అమరావతి, జులై 12: మద్యం కుంభకోణం కేసులో (AP Liquor Scam) సిట్ ముందుకు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి (Former MP Vijayasai Reddy) ఈరోజు విచారణకు హాజరుకావాల్సి ఉంది. అయితే తాను విచారణకు రాలేనని సిట్ అధికారులకు సమాచారం ఇచ్చారు మాజీ ఎంపీ. తనకు ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలు ఉండటం వలన రాలేకపోతున్నట్లు విజయసాయి సమాచారం పంపారు. తాను రేపో మాపో విచారణకు వచ్చే తేదీని తెలియజేస్తానని చెప్పారు. కాగా.. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఒకసారి సిట్ ముందు మాజీ ఎంపీ విచారణకు హాజరయ్యారు.


అయితే ఈరోజు సిట్ ముందుకు విజయసాయి రావాల్సి ఉండగా.. అంతుముందే సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఆసక్తికరమైన పోస్ట్ చేశారు మాజీ ఎంపీ. ఎవరైతే కర్మను చేస్తారో వారు అనుభవించక తప్పదు అనే విధంగా భగవద్గీతకు సంబంధించి ఓ శ్లోకాన్ని ఆయన పోస్టు చేశారు. కాగా.. ఈ కేసుకు సంబంధించి ఏప్రిల్ 18న విజయసాయిని తొలిసారి సిట్ అధికారులు ప్రశ్నించారు. గత విచారణలో కీలక సూత్రధారులు, పాత్రధారుల పేర్లను మాజీ ఎంపీ వెల్లడించారు. ఈ క్రమంలో ఈ కేసులో మొత్తం 11 మందిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. వీరంతా ప్రస్తుతం జైలులో ఉన్నారు.


ఇవి కూడా చదవండి..

ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్‌కు మంత్రి మండపల్లి రాంప్రసాద్ పరామర్శ

మాజీ ఎంపీ ట్వీట్.. ఈ పోస్ట్‌కు అర్థమేమి సాయిరెడ్డి

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 12 , 2025 | 01:35 PM