Share News

Andhrajyothy Photographer Attacked: ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్‌కు మంత్రి మండపల్లి రాంప్రసాద్ పరామర్శ

ABN , Publish Date - Jul 12 , 2025 | 12:04 PM

Andhrajyothy Photographer Attacked: వైసీపీ శ్రేణుల దాడిలో గాయపడ్డ ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శివకుమార్‌కు ప్రభుత్వం అండగా నిలిచింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శివకుమార్‌ను మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి పరామర్శించారు.

Andhrajyothy Photographer Attacked: ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్‌కు మంత్రి మండపల్లి రాంప్రసాద్ పరామర్శ
Andhrajyothy Photographer Attacked

చిత్తూరు, జులై 12: వైసీపీ శ్రేణుల దాడిలో గాయపడి చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్‌ శివకుమార్‌ను (Andhrajyothy photographer Shivakumar) జిల్లా ఇంఛార్జ్‌ మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి (Minister Mandapalli Ramprasad Reddy) ఈరోజు (శనివారం) పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున రెండు లక్షల రూపాయల నగదు చెక్‌ను బాధిత కుటుంబానికి మంత్రి అందించారు. అలాగే అన్ని విధాల ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. శివకుమార్‌పై దాడి చేసిన వ్యక్తులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని మంత్రి స్పష్టం చేశారు.


దాడి ఘటనకు పరోక్షంగా సహకరించిన ఏ ఒక్కరిని వదిలిపెట్టబోమన్నారన్నారు. మంత్రితో పాటు స్థానిక ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ కూడా శివకుమార్‌ను పరామర్శించి.. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కాగా.. ఇటీవల మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం పర్యటనలో వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయి ప్రవర్తించారు. ఆంధ్రజ్యోతి ఫోటో గ్రాఫర్‌పై విచక్షణారహితంగా దాడి చేశారు. జగన్ అక్కడి రైతులతో మాట్లాడే ఫోటోలో తీస్తున్న క్రమంలో ఆంధ్రజ్యోతి చిత్తూరు డిప్యూటీ చీఫ్ ఫోటోగ్రాఫర్ శివ కుమార్‌పై దాడికి పాల్పడ్డారు వైసీపీ మూకలు. దాదాపు పది మంది శివకుమార్‌‌ను చుట్టుముట్టి చొక్కా చింపి మరీ దాడి చేశారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్‌పై జరిగిన దాడిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహా మంత్రులు, కూటమి నేతలు, ప్రజా సంఘాలు, జర్నలిస్ట్ సంఘాలు తీవ్రంగా ఖండించాయి.


ఇవి కూడా చదవండి..

మాజీ ఎంపీ ట్వీట్.. ఈ పోస్ట్‌కు అర్థమేమి సాయిరెడ్డి

ఒక్కసారిగా కుప్పకూలిన 4 అంతస్తుల భవనం.. శిథిలాల కింద జనం..

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 12 , 2025 | 12:49 PM