Home » andhrajyothy
ట్రెడిషనల్ వెడ్డింగ్, డెస్టినేషన్ వెడ్డింగ్ తెలుసు... కానీ ఇటీవల కాలంలో సోషల్‌మీడియాలో బాగా వైరల్ అవుతోన్న కొత్తరకం పెళ్లి ‘ఫేక్ వెడ్డింగ్’. ఈ పెళ్లిలో మండపం, డెకరేషన్, బాజాభజంత్రీలు, డీజే, హల్దీ, సంగీత్, ఫొటోషూట్, బరాత్, మిరుమిట్లు గొలిపే బాణసంచా, భోజనాలు... ఇలా అన్నీ ఉంటాయి. కాకపోతే ఒకే ఒక్క తేడా ఏమిటంటే... పెళ్లికొడుకు, పెళ్లికూతురు మాత్రం ఉండరు.
దోశ ప్లేట్‌లో పట్టేంత చిన్నదే కానీ.. అవకాశాల్లో భూగోళమంత విశాలమైనదని నిరూపించారు కర్ణాటకకు చెందిన శ్రియా నారాయణ్, అఖిల్ అయ్యర్. బెంగళూరు, ముంబయిలలో ఏర్పాటు చేసిన ‘బెన్నె’ దోశలతో నెలకు కోటి రూపాయలు సంపాదిస్తున్నారు. దోశల క్రేజ్‌ని భలేగా క్యాష్ చేసుకున్నారిలా..
చల్లతో అన్నం పైలోకంలో పూర్వీకులు దిగివచ్చినంత కమ్మగా ఉండాలి. సాక్షాత్తూ అమ్మవారు ప్రత్యక్షమై తన చేతుల్తో కలిపి పెట్టినంత మధురంగా ఉండాలి. ‘సందేహం జనయతి సుధాయామతిరసః’ అది తింటే అమృతం కలిసిన అతిరసమా అని సందేహం కలగాలంటాడు పాకశాస్త్ర గ్రంథం క్షేమ కుతూహలంలో క్షేమశర్మ పండితుడు
ఎనభైకి పైగా గదులు... పదుల సంఖ్యలో వరండాలు... వంద అడుగుల ఎత్తైన నిర్మాణం... అది బహుళ అంతస్తుల కాంక్రీటు భవనమని అనుకుంటే పొరపాటే. ఒక చెట్టును ఆసరా చేసుకుని నిర్మించిన అతి పెద్ద ‘ట్రీహౌజ్’. చెక్కతో నిర్మించిన ఈ ఇంటిని చూసేందుకు పర్యాటకులు క్యూ కడుతుంటారు. ప్రపంచంలోనే అతి పెద్ద ‘ట్రీహౌజ్’గా గుర్తింపు పొందిన దాని విశేషాలివి...
ఆ ఊరిలోకి అడుగుపెడితే... నిర్మాణాలన్నీ ఖాళీ సీసాలతోనే కనిపిస్తాయి. సాధారణంగా ఇల్లు కట్టాలంటే ఇటుకలు కావాలి. కానీ ఒక్క ఇటుక కూడా వాడకుండా, ఖాళీ సీసాలతో ఇళ్ల నిర్మా ణాలు చేశారక్కడ. ఇంతకీ ఆ ‘బాటిల్ విలేజ్’ ఎక్కడుందంటే...
ఆ రాశి వారికి ఈ వారం ధనలాభం ఫుల్‌గా ఉంటుందని ప్రముఖ జ్యోతిష్య పండితులు తెలుపుతున్నారు. అలాగే.. మనోధైర్యంతో ముందుకు సాగుతారని, చెల్లింపులు వాయిదా వేసుకుంటారని తెలుపుతున్నారు. అంతేగాక వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారని, గృహాలంకరణ పట్ల ఆసక్తి కలుగుతుందని తెలుపుతున్నారు. ఇంకా ఈ వారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
ఇంట్లో పిల్లి... వీధిలో పులి... అనే మాట అప్పుడప్పుడు వినిపిస్తుంది. నిజానికి చూడటానికి రెండూ ఒకేలా ఉన్నా ఆకారాన్ని బట్టి గుర్తుపట్టొచ్చు. కొద్దిగా రంగులో తేడా ఉన్నా మనకు తెలిసిన పిల్లి ఒకేలా ఉంటుంది. అయితే పులుల్లాంటి పిల్లులు కూడా ఉంటాయంటే నమ్ముతారా? ప్రపంచవ్యాప్తంగా అరుదైన రకాలు చాలానే ఉన్నాయి.
విమానయానం గురించి సోషల్‌మీడియాలో చెబుతూ పాపులర్ అయిన సామ్ చూయి... విమానంలో ఎయిర్ హోస్టెస్‌గా పనిచేసే ఫియోనాను ప్రేమించాడు. వాళ్లిద్దరూ తమ పెళ్లి విమానంలోనే జరగాలనుకున్నారు.
నగరాల్లో ట్రాఫిక్ కష్టాల గురించి తెలిసిందే. గంటల కొద్దీ నిలిచిపోయే ట్రాఫిక్‌తో నిత్యం నరకమే. ముఖ్యంగా కారులో వెళ్లే వారి బాధ చెప్పనక్కర్లేదు. ముందుకూ, వెనక్కి వెళ్లలేని పరిస్థితి. అందుకే ట్రాఫిక్ కష్టాల నుంచి తప్పించు కునేందుకు కారును బైక్‌లా మార్చేశాడు ఒక ఔత్సాహిక మెకానిక్. కారులాంటి బైకులో కూర్చుని, రయ్యిన దూసుకెళ్తున్నాడు.
బ్రహ్మాండం బద్దలై.. భూమి పుట్టినప్పుడు పుట్టింది. నాగరికతల్లో మెరిసింది. రాజులు, రాజ్యాల్లో మురిసింది. ఆంగ్లేయుల్ని ఆకట్టుకుంది. ఆధునికులకు ఆభరణంలా మారింది. ఆ దేశం ఈ దేశం అనేం లేదు.. ప్రపంచమంతా మెచ్చింది. ఎప్పటికప్పుడు తనకు తాను విలువను పెంచుకుంటూ.. దూసుకెళుతున్న ఆ లోహం.. ‘బంగారం’.