Devotional: ఆ రాశి వారికి ఈ వారం ఆదాయం ఫుల్.. కానీ..
ABN , Publish Date - Nov 30 , 2025 | 07:28 AM
ఆ రాశి వారికి ఈ వారం ఆదాయం ఫుల్.. అయితే.. ఖర్చులు తగ్గించుకుంటే మంచిదని ప్రముఖ జ్యోతిష్య పండితులు తెలుపుతున్నారు. అలాగే...అపజయాలకు కుంగిపోవద్దని, ఆశావహదృక్పథంతో మెలగాలని సూచిస్తున్నారు. ఇంకా.. ఎవరెవరి రాశిఫలాలు ఈ వారం ఎలా ఉన్నాయంటే...
అనుగ్రహం
30 నవంబర్ - 6 డిసెంబర్ 2025
పి.ప్రసూనా రామన్
మేషం
అశ్విని, భరణి,
కృత్తిక 1వ పాదం
కృషి ఫలించకున్నా యత్నించా మన్న తృప్తి ఉంటుంది. నిరుత్సాహం వీడి శ్రమించండి. అపజయాలకు కుంగిపోవద్దు. ఆశావహదృక్పథంతో మెలగండి. ధనసహాయం తగదు. మీ ఇబ్బందులను సున్నితంగా తెలి యజేయండి. పనులు, బాధ్యతలు పురమా యించవద్దు. కొందరి నిర్లక్ష్యం చికాకు కలిగి స్తుంది. మితంగా సంభాషించండి. పరిచయ స్తులు మీ వ్యాఖ్యలను వక్రీకరిస్తారు. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు.
వృషభం
కృత్తిక 2,3,4; రోహిణి,
మృగశిర 1,2 పాదాలు
ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. కొత్తయత్నాలు చేపడతారు. కార్యసాధనకు మరింత శ్రమించాలి. దుబారా ఖర్చులు విపరీతం. పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. కొందరి రాకతో కార్యక్రమాలకు విఘాతం కలుగుతుంది. చీటికిమాటికి చికాకు పడతారు. పట్టుదలకు పోవద్దు. మీ తప్పిదాలను సరిదిద్దుకోవటానికి యత్నించండి. తరచూ ఆత్మీయులతో సంభా షిస్తారు. విలువైన వస్తువులు, నగదు జాగ్రత్త.
మిథునం
మృగశిర 3,4; ఆర్ద్ర,
పునర్వసు 1,2,3 పాదాలు
అన్నివిధాలా అనుకూలం. లక్ష్యం నెరవేరుతుంది. అనుకున్న కార్యం సాధిస్తారు. ఆశలొదిలేసుకున్న ధనం అందు తుంది. ఖర్చులు అదుపులో ఉండవు. పనులు త్వరితగతిన సాగుతాయి. పరిచయం లేని వారితో జాగ్రత్త. మీ నుంచి విషయసేకరణకు కొందరు యత్నిస్తారు. ఆంతరంగిక విష యాలు వెల్లడించవద్దు. ఆత్మీయులతో ఉల్లా సంగా గడుపుతారు. ఆహ్వానం అందుకుం టారు. దైవ, ేసవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
కర్కాటకం
పునర్వసు 4వ
పాదం, పుష్యమి, ఆశ్లేష
గ్రహసంచారం అను కూలంగా ఉంది. కష్టానికి తగిన ప్రతిఫలం అందుతుంది. శుభకార్యం నిశ్చయమవుతుంది. వస్తులాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఖర్చులు విపరీతం. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. నగదు డ్రా చేసేటపుడుజాగ్రత్త. చుట్టుపక్కల వారిని ఓ కంట కనిపెట్టండి. ఆత్మీయులతో తరచూ సంభాషిస్తుంటారు. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. గత సంఘటనలు ఉల్లాసం కలిగిస్తాయి.
సింహం
మఖ, పుబ్బ,
ఉత్తర 1వ పాదం
అనుకున్న లక్ష్యం సాధిస్తారు. సర్వత్రా ప్రశాంతత నెలకొంటుంది. ఆదాయా నికి తగ్గట్టుగా ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. ఒకేసారి అనేక పను లతో సతమతమవుతారు. బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు ముందుకు సాగవు. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది. అవతలి వారి స్తోమతను స్వయంగా తెలుసుకోండి. వాహనం, గృహోపకరణాలు మరమ్మతుకు గురవుతాయి.
కన్య
ఉత్తర 2,3,4; హస్త,
చిత్త 1,2 పాదాలు
కొంతమేరకు ఆశాజనకం. శారీరక శ్రమ అధికమైనా ఫలితం ఉంటుంది. ఆదాయానికి తగ్గట్టుగానే ఖర్చులుంటాయి. పొదుపునకు అవకాశం లేదు. పరిచయస్తులు మీ సాయం కోరుతారు. ధనసహాయం విష యం పునరాలోచించండి. పనులు మధ్యలో ఆపవద్దు. ఇంటి విషయాలపై దృష్టి పెట్టండి. ఒక సంఘటన మీపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అయినవారిని సంప్రదిస్తారు. ఎదుటివారి అభిప్రాయాలు పట్టించుకోండి.
తుల
చిత్త 3,4; స్వాతి,
విశాఖ 1,2,3 పాదాలు
కార్యసాధనకు ఓర్పు ప్రధా నం. ఉత్సాహంగా యత్నాలు సాగించండి. పెద్దఖర్చు తగిలే ఆస్కారం ఉంది. పనులు ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. . ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. సన్నిహి తులను సంప్రదిస్తారు. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. కుటుంబీకుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయండి. కొత్తప్రదేశాలు, పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
వృశ్చికం
విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ
ప్రతికూలతలు అధికం. ఆచితూచి అడుగేయండి. ఏ పని తలపెట్టినా మళ్లీ మొదటికే వస్తుంది. చీటికిమాటికి అసహనం చెందుతారు. ఊహించని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. అపరిచితులు మోస గించేందుకు యత్నిస్తారు. గుంభనంగా మెల గండి. ఏ విషయాన్నీ పెద్దగా పట్టించుకోవద్దు. కొందరి వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి. దైర్యంగా యత్నాలు సాగించండి. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి.
ధనుస్సు
మూల, పూర్వాషాఢ,
ఉత్తరాషాఢ 1వ పాదం
కార్యానుకూలత ఉంది. అనుకున్న లక్ష్యం సాధిస్తారు. మొండి బాకీలు వసూలవుతాయి. ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. ఏ పనీ ముందుకు సాగదు. మానసికంగా కుదుటపడతారు. పత్రాల్లో సవరణలు అనుకూలించవు. పట్టుదలతో మరోసారి యత్నించండి. ఆహ్వానం అందుకుంటారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. ప్రాజెక్టులు, పెట్టుబడులకు అనుకూలం.
మకరం
ఉత్తరాషాఢ 2,3,4;
శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు
ఆదాయం బాగుంటుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. పనులు చురు కుగా సాగుతాయి. వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు. స్నేహసంబంధాలు బలపడ తాయి. మీ వ్యక్తిత్వానికి భంగం కలిగే సూచ నలున్నాయి. అనవసర విషయాలు పట్టించు కోవద్దు. పిల్లల భవిష్యత్తుపై దృష్టి పెట్టండి. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవు తాయి. మానసికంగా కుదుటపడతారు. ప్రియతములతో కాలక్షేపం చేస్తారు.
కుంభం
ధనిష్ట 3,4; శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు
అన్నివిధాలా కలిసివచ్చే సమయం. మీ కృషి ఫలిస్తుంది. లక్ష్యానికి చేరువవుతారు. రావలసిన ధనం అందు తుంది. పొదుపు పథకాలపై దృష్టిపెడతారు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. చేపట్టిన పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. ముఖ్యు లను కలిసినా ఫలితం ఉండదు. మొండిగా ముందుకు సాగుతారు. ఆలోచనలు కార్య రూపం దాల్చుతాయి.ఉల్లాసంగా గడుపుతారు. మీ సిఫార్సుతో ఒకరికి సదవకాశం లభిస్తుంది.
మీనం
పూర్వాభాద్ర 4వ
పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. ఊహలు, అంచనాలు ఫలిస్తాయి. ప్రముఖు లకు సన్నిహితులవుతారు. ఆశించిన పదవి దక్కదు. బాధ్యతగా మెలగండి. చిన్న చిన్న విషయాలకు ప్రాధాన్యమివ్వవద్దు. విలా సాలకు విపరీతంగా ఖర్చు చేస్తారు. పెద్ద మొత్తం ధన సహాయం తగదు. మీ ఇబ్బం దులను సున్నితంగా వ్యక్తం చేయండి. ఎవరినీ నొప్పించ వద్దు. పరిచయస్తులతో విభేదిస్తారు. పనులు ఒక పట్టాన పూర్తికావు.
ఈ వార్తలు కూడా చదవండి..
నేడు, రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు
Read Latest Telangana News and National News