Home » Sunday
నాకు చిన్నప్పటి నుంచి సంగీతమంటే ప్రాణం. ఆ మక్కువతోనే తరచూ రేడియోల్లో పాటలు వినేదాన్ని. టీవీలో సంగీత కార్యక్రమాల్ని ఆసక్తిగా చూసేదాన్ని. ఎక్కడ సంగీత ప్రదర్శనలు జరిగినా వెళ్లేదాన్ని... అన్నారు ప్రముఖ నటి గిరిజా ఓక్. విభిన్న శైలిలో పాటలు ఎలా పాడాలో చూసి నేర్చుకున్నానని, మరాఠీలోని ‘సింగింగ్ స్టార్’లో పాల్గొని ఫైనలిస్ట్‌గా నిలిచాపపి ఆమె అన్నారు.
వివాహ వేడుకలో ఎక్కువ సేపు నిలబడడం, నడవడం, డ్యాన్సు స్టెప్పులు వేయడం వల్ల అలసటకు గురైన అతిథులు, కుటుంబ సభ్యులకు ఉపశమనం కలిగించడానికి ‘ఫుట్ స్పా’ను అందిస్తున్నారు.
తీపి, పులుపు, ఉప్పు, కారం, వగరు చేదూ ఆరు రుచులూ కలగసిన షడ్రసోపేత వంటకం కచోరీ. ఉత్తరాదిలో కచోరీ ప్రసిద్ధి. సూరదాసు ‘పూరీ సపూరీ కచౌరౌ కౌరీబ సదళ సు ఉజ్వల సుందర శౌరీ’ అంటూ పొంగిన పూరీలు ... పొరలు పొరలుగా బంగారు రంగులో మెరిసే గుండ్రని కచ్చౌరీల ఉజ్వల సుందర శోభను వర్ణిస్తాడు.
పర్యాటకులకు విశాఖపట్నంలో మరో ఆకర్షణ తోడయ్యింది. ఇప్పటి దాకా విదేశాల్లో మాత్రమే చూసిన అద్దాల వంతెనపై నడక అనుభవాన్ని ఇక నుంచి మనమూ పొందొచ్చు. దేశంలోనే అతి పొడవైన ‘స్కై గ్లాస్ బ్రిడ్జ్’ని విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) నిర్మించింది.
బంగారం బంగారమే! కాదనలేం. కానీ, వెండికీ పెద్ద చరిత్రే ఉంది. ప్రపంచవ్యాప్తంగా అనేక మానవ సంస్కృతులతో ఈ లోహ బంధం విడదీయలేనంతగా పెనవేసుకుంది. తవ్వేకొద్దీ వెండి చరిత్ర బయల్పడుతూనే ఉంది. మానవ నాగరికతలో వేల ఏళ్ల నుంచీ ఆభరణాలు, నాణేలు, దేవతామూర్తుల రూపంలో వెండి మన ఆత్మీయలోహంగా మారిపోయింది.
నదులు సముద్రాల్లో కలిసే దృశ్యాన్ని ఎప్పుడైనా చూశారా? అలాగే నదీ సంగమం కూడా ఉంటుంది. వేర్వేరు ప్రాంతాల నుంచి ప్రవహిస్తూ వచ్చిన నదులు... ఒకచోట కలిసి పెద్ద నదిగా మారి ప్రవహిస్తుంటాయు. ఆ సమయంలో వాటి రంగుల్లో తేడాలుండటం వల్ల అక్కడొక అద్భుత దృశ్యం ఆవిష్కృతమవుతుంది. అలాంటి కొన్ని వి‘చిత్ర’ నదీ సంగమాల విశేషాలే ఇవి...
మార్చెల్ల గియులియాపేస్.. ఇటలీ దేశస్థురాలు. ఒకప్పుడు మాఫియా రాజ్యానికి పెట్టింది పేరయిన ‘సిసిలీ’లోని రగుస ద్వీపంలో పుట్టిందామె. వాళ్ల అమ్మమ్మలు, తాతయ్యల కాలంలో సిసిలీ తుపాకుల మోతతో హింసాత్మకంగా ఉండేది. మాఫియా ముఠాలు కొట్టుకుచచ్చేవి.
ఆ రాశి వారికి ఈ వారం ఆర్ధికంగా బాగుంటుంది... అని ప్రముఖ జ్యోతిష్య పండితులు తెలుపుతున్నారు. అయితే.. కొన్ని విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. అలాగే.. పిల్లలకు మంచి జరుగుతుందని, ఆహ్వానం అందుకుంటారని తెలుపుతున్నారు. మొత్తంగా.. ఈ వారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే...
మన జీవిత పుస్తకంలో ‘చార్‌ధామ్’ యాత్ర లాంటి పేజీ ఒకటి ఉంటే దానికి మరింత విలువ చేకూరుతుంది. ‘చార్‌ధామ్’ యాత్రలో వేసే ప్రతీ అడుగు జీవితంలో కొత్త మలుపునిస్తుంది. మానసికంగా ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. ఆ విశేషాలే ఇవి...
ఘార అనే సంస్కృత పదానికి ‘చల్లటం’ అని అర్థం. నేతిని చేతిలో పోయించుకుని అన్నం మీద చల్లి అప్పుడు కలుపుకుని తినేవాళ్లు. అభిఘారం అంటే ఇదే! అలా నెయ్యి గానీ, పాలు గాని చల్లుతూ గోధుమ పిండిని తడిపి ముద్దలా చేసి ఉండలు కట్టి, ఒక్కో ఉండనీ బిళ్ళలుగా చేసి నేతిలో వేగించి పంచదార పాకం పట్టిన బూరెలు ఘారాపూపకాలు.