Share News

Devotional: ఆ రాశి వారికి ఈ వారం రావాల్సిన ధనం అందుతుంది..

ABN , Publish Date - Nov 23 , 2025 | 07:13 AM

ఆ రాశి వారికి ఈ వారం రావాల్సిన ధనం అందుతుందని ప్రముఖ జ్యోతిష్య పండితులు తెలుపుతున్నారు. అలాగే... సంప్రదింపులతో తీరిక ఉండదు. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయని సూచిస్తున్నారు. ఇంకా.. ఒక ప్రణాళిక ప్రకారం పనులు పూర్తి చేస్తారని, మొత్తానికి ఈ వారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే...

Devotional: ఆ రాశి వారికి ఈ వారం రావాల్సిన ధనం అందుతుంది..

అనుగ్రహం

23 - 29 నవంబర్‌ 2025

పి.ప్రసూనా రామన్‌

మేషం

అశ్విని, భరణి,

కృత్తిక 1వ పాదం

పరిస్థితులు అనుకూలిస్తాయి. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. ప్రణాళికా బద్థంగా పనులు పూర్తిచేస్తారు. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. చుట్టుపక్కల వారిని గమనించండి. ఒప్పందాల్లో ఆచితూచి అడుగు వేయండి. ఏకపక్ష నిర్ణయం తగదు. అనుభవజ్ఞులను సంప్రదించండి. మొహమాటాలు, భేషజాలకు పోవద్దు. సేవ, పుణ్యకార్యాల్లో పాల్గొంటారు.


వృషభం

కృత్తిక 2,3,4; రోహిణి,

మృగశిర 1,2 పాదాలు

సంప్రదింపులు ఫలిస్తాయి. రుణసమస్య నుంచి విముక్తి లభిస్తుంది. మానసికంగా స్థిమితపడతారు. ధనం మితంగా వ్యయం చేయండి. సావకాశంగా పనులు పూర్తిచేస్తారు. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. అనవసర విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం వాటిల్లే ఆస్కారం ఉంది. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. మీ సిఫార్సుతో ఒకరికి సదవకాశం లభిస్తుంది.


మిథునం

మృగశిర 3,4; ఆర్ద్ర,

పునర్వసు 1,2,3 పాదాలు

పరిస్థితులు చక్కబడతాయి. చాకచక్యంగా వ్యవహరిస్తారు. ఒక సమస్య మీకు అనుకూలంగా పరిష్కారమవుతుంది. మానసికంగా స్థిమితపడతారు. పెద్దఖర్చు తగిలే ఆస్కారం ఉంది. నగదు, ఆభరణాలు జాగ్రత్త. పనులు, బాధ్యతలు పురమాయించ వద్దు. కొందరి నిర్లక్ష్యం మీకు అవస్థలు తెచ్చి పెడుతుంది. ఆత్మీయులతో సంభాషిస్తారు. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలను వదులుకోవద్దు.


కర్కాటకం

పునర్వసు 4వ

పాదం, పుష్యమి, ఆశ్లేష

సంప్రదింపులతో తీరిక ఉండదు. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. కొత్త విషయం తెలుసుకుంటారు. ఖర్చులు విపరీతం. పొదుపునకు అవకాశం లేదు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. ముఖ్యల కలయిక వీలుపడదు. కార్యక్రమాల్లో మార్పులుంటాయి. పట్టు విడుపు ధోరణిలో సమస్యలు పరిష్కరించు కోండి. పిల్లల భవిష్యత్తుపై దృష్టిసారించండి. ఆత్మీయుల కలయిక ఉత్తేజపరుస్తుంది.


సింహం

మఖ, పుబ్బ,

ఉత్తర 1వ పాదం

రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు సామాన్యం. ఒక ప్రణాళిక ప్రకారం పనులు పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. పరిచయస్తులు సహాయం అర్థిస్తారు. అప్రమత్తంగా ఉండా ల్సిన సమయం. మధ్యవర్తిత్వాలు తగవు. మీ ఇష్టాయిష్టాలను సున్నితంగా వ్యక్తం చేయండి. మిత సంభాషణం శ్రేయస్కరం. ఒకరి వద్ద మరొకరి ప్రస్తావన తగదు. మీ వ్యక్తిత్వానికి భంగం కలుగకుండా మెలగండి.


కన్య

ఉత్తర 2,3,4; హస్త,

చిత్త 1,2 పాదాలు

అందరితోనూ మితంగా సంభా షించండి. ఆగ్రహావేశాలకు గురికావద్దు. ప్రశాంతంగా ఉండటానికి యత్నించండి. వ్యాపకాలు సృష్టించుకోవటం శ్రేయస్కరం. పనులు ఒక పట్టాన పూర్తికావు. ముఖ్యులను కలిసినా ఫలితం ఉండదు. పిల్లలకు మంచి జరుగుతుంది. పత్రాల్లో సవరణలు అనుకూ లించవు. పట్టుదలతో మరోసారి యత్నిం చండి. కొత్త పరిచయం ఏర్పడుతుంది. వాయిదా పడిన మొక్కులు తీర్చుకుంటారు.


తుల

చిత్త 3,4; స్వాతి,

విశాఖ 1,2,3 పాదాలు

ఆశావహదృక్పథంతో మెలగండి. యత్నాలు విరమించుకోవద్దు. సంకల్పబలమే మీ విజయానికి దోహదపడు తుంది. అవకాశం చేజారినా ఒకందుకు మంచిదే. త్వరలో మీ కృషి ఫలిస్తుంది. ఆపత్స మయంలో అయినవారు ఆదుకుంటారు. ఖర్చులు అదుపులో ఉండవు. చెల్లింపుల్లో జాప్యం తగదు. మీ అలక్ష్యం ఇబ్బంది కలిగిస్తుంది. సన్నిహితులకు మీ సమస్య తెలియజేయండి. ఆహ్వానం అందుకుంటారు.


వృశ్చికం

విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ

ప్రతికూలతలు అధికం. లావా దేవీలు ముందుకు సాగవు. అన్యమనస్కంగా గడుపుతారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఏ పని మొదలెట్టినా తిరిగి మొదటికేవస్తుంది. ఊహించని ఖర్చు ఆందోళన కలిగిస్తుంది. ధనసహాయం అర్థించేందుకు మనస్కరించదు. ఈ చికాకులు తాత్కాలికమే. ఆత్మీయుల వ్యాఖ్యలు ఉత్తేజపరుస్తాయి. ధైర్యంగాఅడుగు ముందుకేస్తారు. అవకాశాలను తక్షణం అంది పుచ్చుకోండి. అనుమానాలకు తావివ్వవద్దు.


ధనుస్సు

మూల, పూర్వాషాఢ,

ఉత్తరాషాఢ 1వ పాదం

మీ కష్టం ఫలిస్తుంది. అవకా శాలు కలిసివస్తాయి. కొత్తయత్నాలకు శ్రీకారం చుడతారు. గృహమార్పు కలిసివస్తుంది. స్నేహసంబంధాలు బలపడతాయి. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. సంస్థల స్థాపన లకు అనుకూలం. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. దూరపు బంధువుల ఆహ్వానం అందుకుంటారు. ఒక సమాచారం ఆలోచింప చేస్తుంది. సన్నిహితులకు మీ సమస్య తెలియజేయండి. ఒంటెద్దుపోకడ తగదు.


మకరం

ఉత్తరాషాఢ 2,3,4;

శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు

శుభకార్యాన్ని ఆర్భాటంగా చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడ తాయి. పరస్పరం కానుకలిచ్చిపుచ్చుకుంటారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. విలా సాలకు ఖర్చుచేస్తారు. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు అర్థాంతరంగా ముగిస్తారు. పత్రాల రెన్యువల్‌లో అశ్రద్ధ తగదు. ముఖ్య మైన లావాదేవీలు స్వయంగా చూసుకోండి. పెద్దల గురించి ఆందోళన చెందుతారు.


కుంభం

ధనిష్ట 3,4; శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు

ధనలాభం, కార్యసిద్ధి ఉన్నాయి. మీపై సన్నిహితుల వ్యాఖ్యలు పనిచేస్తాయి. సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. అప్రమత్తంగా ఉండా ల్సిన సమయం. పెద్దమొత్తం నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. చుట్టుపక్కల వారిని గమనించండి. బ్యాంకు వివరాలు వెల్లడించ వద్దు. ఒక సంబంధం కుదిరే సూచనలు న్నాయి. మీ ఇష్టాయిష్టాలను స్పష్టంగా తెలియజేయండి. ఆరోగ్యం జాగ్రత్త.


మీనం

పూర్వాభాద్ర 4వ

పాదం, ఉత్తరాభాద్ర, రేవతి

లావాదేవీలు కొలిక్కివస్తాయి. రుణవిముక్తులై తాకట్టు విడిపించుకుంటారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూల మవుతాయి. కీలక పత్రాలు అందుకుంటారు. ఖర్చులు ప్రయోజనకరం. పెట్టుబడులు కలిసిరావు. పెద్దల సలహా పాటించండి. నచ్చని సంఘటనలెదురవుతాయి. ఎవరినీ నొప్పించ వద్దు. మీ పొరపాట్లు సరిదిద్దుకోండి. సన్నిహితులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. వ్యాపకాలు సృష్టించుకుంటారు.

Updated Date - Nov 23 , 2025 | 07:13 AM