Janasena: జనసేన నుంచి శ్రీకాళహస్తి ఇన్‌ఛార్జ్ వినుత బహిష్కరణ.. అసలు కారణమిదే..
ABN , Publish Date - Jul 12 , 2025 | 01:47 PM
జనసేన శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ వినుతను ఆ పార్టీ అధిష్టానం బహిష్కరించింది. ఈ మేరకు మీడియాకు జనసేన అధిష్టానం శనివారం లేఖ విడుదల చేసింది. వినుత వ్యవహార శైలి పార్టీ విధి విధానాలకి భిన్నంగా ఉండటంతో ఆమెని గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉంచినట్లు జనసేన హై కమాండ్ తెలిపింది.

శ్రీకాళహస్తి: జనసేన శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ వినుతను (Janasena Srikalahasti incharge Vinuta) ఆ పార్టీ అధిష్టానం బహిష్కరించింది. ఈ మేరకు మీడియాకు జనసేన అధిష్టానం ఇవాళ(శనివారం) లేఖ విడుదల చేసింది. వినుత వ్యవహార శైలి జనసేన విధి విధానాలకి భిన్నంగా ఉండటంతో ఆమెని గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉంచినట్లు జనసేన హై కమాండ్ తెలిపింది. ఆమెపై చెన్నైలో జరిగిన ఓ హత్య కేసు ఆరోపణలు పార్టీ దృష్టికి వచ్చాయని గుర్తుచేసింది. ఈ క్రమంలో వినుత కోటను పార్టీ నుంచి బహిష్కరించామని జనసేన హై కమాండ్ ప్రకటించింది.
ఏం జరిగిందంటే..
కోట వినుత డ్రైవర్ శ్రీనివాసులు అలియాస్ (రాయుడు)(24) చైన్నెలో దారుణ హత్యకి గురయ్యాడు. చెన్నై మిట్ రెడ్ హిల్స్ పరిసర ప్రాంతాల్లో రాయుడు మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. సంఘటన స్థలానికి చేరుకొని పోలీసులు పరిశీలించారు. వినుత డ్రైవర్ రాయుడు కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందజేశారు. సంఘటనా స్థలానికి రాయుడు నానమ్మ వచ్చింది. ఆమెని పోలీసులు విచారణ చేశారు. మూడు నెలలుగా రాయుడుకు వినుత కుటుంబ సభ్యులతో విభేదాలు ఉన్నాయని తెలిపింది. రాయుడు మృతికి వినుత కుటుంబ సభ్యులే కారణమని అనుమానం వ్యక్తం చేశారు. రాయుడు నానమ్మ ఫిర్యాదు మేరకు వినుత, ఆమె భర్త కోట చంద్రబాబు, వినుత తండ్రి భాస్కర్‌లని చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు పోలీసులు ఈ కేసుని ముమ్మరంగా దర్యాప్తు జరుపుతున్నారు.
రాయుడుని తొలగించిన వినుత..
కాగా, బొక్కసంపాలెం గ్రామానికి చెందిన రాయుడు కొన్నేళ్లుగా జనసేన నేత వినుత దగ్గర నమ్మకంగా పనిచేస్తున్నాడు. డ్రైవర్‌గా పనిచేస్తునే వ్యక్తిగత సహాయకుడిగానూ ఉన్నారు. అయితే జూన్ 21వ తేదీన రాయుడిని విధుల నుంచి వినుత తొలగించింది. ఇక నుంచి తమకు రాయుడితో ఎలాంటి సంబంధం లేదని వినుత ప్రకటించారు. తనకు చేసిన నమ్మక ద్రోహానికి రాయుడిని విధుల నుంచి తొలగించినట్లు స్పష్టం చేశారు. ఆ తర్వాత ఈ నెల(జులై) 8వ తేదీన రాయుడు హత్యకు గురయ్యాడు. ఈ కేసుపై పోలీసులు విచారణ చేయగా వినుత, ఆమె భర్త కోట చంద్రబాబు హస్తం ఉందని తేలడంతో వీరిని పోలీసులు అదుపులోకి తీసుకోని విచారిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మాజీ ఎంపీ ట్వీట్.. ఈ పోస్ట్‌కు అర్థమేమి సాయిరెడ్డి
ఒక్కసారిగా కుప్పకూలిన 4 అంతస్తుల భవనం.. శిథిలాల కింద జనం..
Read Latest AP News And Telugu News