Home » Srikalahasti
శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి అనుబంధంగా విజ్ఞానగిరిపై సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో ఈనెల 15 నుంచి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.
వారంతా నిరుపేద గిరిజనులు. మామిడి సీజన్‌లో కాయల కోతలకు వెళుతుంటారు. అలా ఆదివారం అన్నమయ్య జిల్లా రాజంపేటలోని ఇసుకపల్లెలో మామిడికోతకు వెళ్లారు. పని ముగించుకుని లారీలో కాయలను వేసుకుని వస్తుండగా పుల్లంపేట మండలంలోని రెడ్డిపల్లె చెరువుకట్ట వద్ద ఆదివారం రాత్రి లారీ బోల్తా పడింది.
జనసేన శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ వినుతను ఆ పార్టీ అధిష్టానం బహిష్కరించింది. ఈ మేరకు మీడియాకు జనసేన అధిష్టానం శనివారం లేఖ విడుదల చేసింది. వినుత వ్యవహార శైలి పార్టీ విధి విధానాలకి భిన్నంగా ఉండటంతో ఆమెని గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉంచినట్లు జనసేన హై కమాండ్ తెలిపింది.
కలంకారీ కళాకారుడిగా విశేష గుర్తింపు పొందిన తలిశెట్టి మోహన్, ఆయన మనవడు వేహాంత్‌ను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అభినందించారు.
Srikanth Pooja Controversy: శ్రీకాళహస్తి పట్టణం సన్నిధి వీధిలోని రాఘవేంద్ర స్వామి మఠంలో ఈనెల 29న హీరో శ్రీకాంత్ కుటుంబం నవగ్రహ శాంతి పూజలు చేయించుకున్నారు. ప్రత్యేక పూజలు చేసిన అర్చకుడిపై ఈవో చర్యలు తీసుకున్నారు.
విశ్వావసు నామ సంవత్సర ఉగాది ళసందర్భంగా ఆదివారం తిరుమల కొండ కళకళలాడింది. శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం శాస్ర్తోక్తంగా నిర్వహించారు.
గుర్తు తెలియని వ్యక్తిని హతమార్చి ఇసుకలో పూడ్చిపెట్టిన ఉదంతం ఆలస్యంగా వెలుగు చూసింది. తొట్టంబేడు ఎస్‌ఐ ఈశ్వరయ్య తెలిపిన వివరాలు... తొట్టంబేడు మండలం శివనాథపురం పరిధిలోని రాజీవ్‌నగర్(Rajivnagar)లో పలు నిర్మాణాలు వివిధ దశల్లో అసంపూర్తిగా ఉన్నాయి.
శ్రీకాళహస్తీ శ్వరాలయ మహా శివరాత్రి ఉత్సవాలు శుక్రవారం భక్తకన్నప్ప ధ్వజారోహణంతో ప్రారంభంకాను న్నాయి.
శ్రీకాళహస్తీశ్వరాలయంలో సోమవారం 300 ఏళ్ల నాటి పగడ చెట్టు కొమ్మలు విరిగి పడ్డాయి. ఆ సమయానికి భక్తులు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. శ్రీకాళహస్తీశ్వరాలయం(Srikalahasti Temple)లోని రాయలవారి మండపం పక్కనే పగడ చెట్టు ఉంది. ప్రస్తుతం రాయలవారి మండపంలో రూ.500 రాహుకేతు పూజలను జరిపిస్తుంటారు.
వైసీపీ నేత, ముక్కంటి ఆలయ ధర్మకర్తల మండలి మాజీ సభ్యుడు బుల్లెట్ జయశ్యామ్(Bullet Jayashyam)ను పోలీసులు అరెస్టు చేశారు. చీటింగ్ కేసులో ఆయనకు 14రోజుల రిమాండ్ విధించారు. శ్రీకాళహస్తి(Srikalahasti) పట్టణ శివార్లలోని రాజీవ్‌నగర్ వద్ద కొందరు వైసీపీ నాయకులు పిచ్చాటూరు రహదారికి ఆనుకుని ఉన్న పనస కాలువ భూమిని గత ప్రభుత్వ హయాంలో కబ్జా చేశారు.