Share News

Srikalahasti: ఆ 9 మంది మృతుల్లో ఐదుగురు శ్రీకాళహస్తివారే..

ABN , Publish Date - Jul 15 , 2025 | 12:12 PM

వారంతా నిరుపేద గిరిజనులు. మామిడి సీజన్‌లో కాయల కోతలకు వెళుతుంటారు. అలా ఆదివారం అన్నమయ్య జిల్లా రాజంపేటలోని ఇసుకపల్లెలో మామిడికోతకు వెళ్లారు. పని ముగించుకుని లారీలో కాయలను వేసుకుని వస్తుండగా పుల్లంపేట మండలంలోని రెడ్డిపల్లె చెరువుకట్ట వద్ద ఆదివారం రాత్రి లారీ బోల్తా పడింది.

Srikalahasti: ఆ 9 మంది మృతుల్లో ఐదుగురు శ్రీకాళహస్తివారే..

- మామిడి కోతలకు వెళ్లి విగతజీవులుగా మారిన గిరిజనులు

- మృతదేహాల రాకతో విషాదం

రైల్వేకోడూరు/శ్రీకాళహస్తి: వారంతా నిరుపేద గిరిజనులు. మామిడి సీజన్‌లో కాయల కోతలకు వెళుతుంటారు. అలా ఆదివారం అన్నమయ్య(Annamayya) జిల్లా రాజంపేటలోని ఇసుకపల్లెలో మామిడికోతకు వెళ్లారు. పని ముగించుకుని లారీలో కాయలను వేసుకుని వస్తుండగా పుల్లంపేట మండలంలోని రెడ్డిపల్లె చెరువుకట్ట వద్ద ఆదివారం రాత్రి లారీ బోల్తా పడింది. ఈ ఘటనలో 9 మంది మృత్యువాతపడ్డారు.


వీరిలో నలుగురు రైల్వేకోడూరు మండలంలోని శెట్టిగుంట.. మిగిలిన ఐదుగురు శ్రీకాళహస్తి(Srikalahasti) మండలం కలవగుంట, గుండ్లపల్లి, చుక్కలనిడిగల్లు ఎస్టీ కాలనీలకు చెందిన వారని తెలిసింది. వీరి మృతదేహాలు సోమవారం ఆయా కాలనీలకు చేరడంతో విషాదం నెలకొంది. శెట్టిగుంటతో పాటు శ్రీకాళహస్తి ప్రాంతంలోని వీరంతా బంధువులే.


nani4.jpg

మృతిచెందిన వారిని గజ్జల గంగమ్మ, చిట్టెమ్మ, రాధమ్మ, జాని, వడమంచి శ్రీను, గజ్జల సుబ్బరత్న, గజ్జల దుర్గయ్య దంపతులుగా గుర్తించారు. వీరిలో వడమంచి శ్రీనుది శ్రీకాళహస్తి మండలం గుండ్లపల్లి.. చిట్టెమ్మది కలవగుంట ఎస్టీకాలనీలు. వీరి మృతదేహాలకు సోమవారం బొజ్జల బృందమ్మ నివాళులర్పించారు. మృతుల కుటుంబీకులకు ఆర్థికసాయం చేశారు. మిగతా ముగ్గురి విషయంలో స్పష్టత లేదు. కాగా, రాజంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో శవపరీక్షలు పూర్తయి అంబులెన్సుల్లో ఆయా గ్రామాలకు మృతదేహాలను చేర్చారు.


అధిక లోడే కారణం

ప్రమాదానికి గురైంది ఆరు టైర్ల లారీ. ఈ లారీలో సాధారణంగా 6 టన్నులే వేయాలి. దీనికన్నా ఎక్కువగా వేశారు. ముందు వెళుతున్న లారీని ఓవర్‌టేక్‌ చేసి ఆ తర్వాత ముందు వచ్చే కారును తప్పించాలని చూడటంతో బోల్తాపడిందని స్థానికులు స్థానికులు చెబుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి.

మరింత పెరిగిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

యువతి మోజులో పడి భర్త వేధింపులు ఉరివేసుకొని భార్య ఆత్మహత్య

Read Latest Telangana News and National News

Updated Date - Jul 15 , 2025 | 12:12 PM