AP News: వ్యక్తిని హతమార్చి.. ఇసుకలో పూడ్చిపెట్టి..
ABN , Publish Date - Feb 22 , 2025 | 01:21 PM
గుర్తు తెలియని వ్యక్తిని హతమార్చి ఇసుకలో పూడ్చిపెట్టిన ఉదంతం ఆలస్యంగా వెలుగు చూసింది. తొట్టంబేడు ఎస్‌ఐ ఈశ్వరయ్య తెలిపిన వివరాలు... తొట్టంబేడు మండలం శివనాథపురం పరిధిలోని రాజీవ్‌నగర్(Rajivnagar)లో పలు నిర్మాణాలు వివిధ దశల్లో అసంపూర్తిగా ఉన్నాయి.

- గుర్తు తెలియని వ్యక్తి దారుణహత్య
- ఇసుకలో పూడ్చిపెట్టిన హంతకులు
- ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన
శ్రీకాళహస్తి: గుర్తు తెలియని వ్యక్తిని హతమార్చి ఇసుకలో పూడ్చిపెట్టిన ఉదంతం ఆలస్యంగా వెలుగు చూసింది. తొట్టంబేడు ఎస్‌ఐ ఈశ్వరయ్య తెలిపిన వివరాలు... తొట్టంబేడు మండలం శివనాథపురం పరిధిలోని రాజీవ్‌నగర్(Rajivnagar)లో పలు నిర్మాణాలు వివిధ దశల్లో అసంపూర్తిగా ఉన్నాయి. శుక్రవారం సుగుణ అనే మహిళ రాజీవ్‌నగర్‌లో ఇంటి నిర్మాణ పనులు చేస్తుండగా ఇసుక తగ్గింది. దీంతో సమీపంలోని అసంపూర్తిగా ఉన్న ఓ ఇంట్లో ఇసుకను తీసుకునేందుకు మరో మహిళను వెంటబెట్టుకుని వెళ్లింది. అక్కడ ఇంట్లో ఇసుకపై ఉన్న సిమెంటు ఇటుకలను పక్కకు తీయగానే మృతదేహం కాలు బయటపడింది.
ఈ వార్తను కూడా చదవండి: TDP: అనంతా.. మభ్యపెట్టే మాటలు మానుకో...
బిత్తర పోయిన వీరిద్దరూ తొట్టంబేడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీకాళహస్తి డీఎస్పీ నరసింహమూర్తి, సీఐ తిమ్మయ్య, ఎస్‌ఐ ఈశ్వరయ్య సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇసుకలోని మృతదేహాన్ని వెలికి తీశారు. సుమారు ఒకటిన్నర నెల క్రితం పూడ్చినట్లు అంచనా వేశారు. శ్రీకాళహస్తి ప్రభుత్వాస్పత్రి వైద్యబృందంతో ఘటనా స్థలంలో పోస్టుమార్టం పూర్తి చేశారు. మృతదేహం వెలుగు చూసిన ఇంటి స్థలం ఎవరిది అన్నది ఆరా తీస్తున్నారు. మృతదేహాన్ని శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఈశ్వరయ్య తెలిపారు.
ఈవార్తను కూడా చదవండి: Hyderabad: పర్యాటకానికి అందం
ఈవార్తను కూడా చదవండి: Medak: రేవంత్ మాటలు కోటలు దాటుతున్నాయి
ఈవార్తను కూడా చదవండి: LRS: ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు నిర్ధారణ!
ఈవార్తను కూడా చదవండి: BJP.. కేసీఆర్ పాలనలోనే ఆర్థిక వ్యవస్థ కొల్లగొట్టారు
Read Latest Telangana News and National News