Share News

Minister Narayana: విజయవాడలో నీటి సరఫరాని ప్రధాని మోదీ అభినందించారు: మంత్రి నారాయణ

ABN , Publish Date - Jul 28 , 2025 | 01:42 PM

సీఎం చంద్రబాబు పర్యవేక్షణతో విజయవాడలో ఇటీవలే స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డు దక్కించుకుందని మంత్రి నారాయణ తెలిపారు. సీఎం చంద్రబాబు కృషితో రాష్ట్రానికి అమృత్ పథకం ద్వారా కేంద్రం నిధులు కేటాయించిందని గుర్తుచేశారు. అమృత్ పథకం ద్వారా ఏపీవ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో వచ్చే మూడేళ్లలో ప్రతి ఇంటికీ తాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి నారాయణ పేర్కొన్నారు.

Minister Narayana:  విజయవాడలో నీటి  సరఫరాని ప్రధాని మోదీ అభినందించారు: మంత్రి నారాయణ
Minister Narayana

అమరావతి: విజయవాడలో నీటి సరఫరాను ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) అభినందించడం గర్వకారణమని మంత్రి నారాయణ (Minister Narayana) వ్యాఖ్యానించారు. నిన్నటి(ఆదివారం) మన్ కీ బాత్‌లో విజయవాడలో నీటి సరఫరాపై ప్రధాని ప్రశంసలు కురిపించారని చెప్పుకొచ్చారు. విజయవాడలో నీటి నిర్వహణ చాలా బాగుందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారని గుర్తుచేశారు. ఈ సందర్భంగా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ధ్యానచంద్ర, ఇతర అధికారులు, సిబ్బందికి మంత్రి నారాయణ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఇవాళ(సోమవారం) మంత్రి నారాయణ ఓ ప్రకటన విడుదల చేశారు.


ప్రధాని మోదీ వ్యాఖ్యలు కూటమి ప్రభుత్వ అభివృద్ధికి నిదర్శనమని మంత్రి నారాయణ ఉద్ఘాటించారు. సీఎం చంద్రబాబు పర్యవేక్షణతో విజయవాడలో ఇటీవలే స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డు దక్కించుకుందని తెలిపారు. విజయవాడ కార్పొరేషన్‌లో ప్రతి రోజూ 16 లక్షల మందికి స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్నామని వెల్లడించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొండప్రాంతాల్లో సైతం ఎలాంటి ఇబ్బంది లేకుండా నీటి సరఫరా చేస్తున్నామని వివరించారు. సీఎం చంద్రబాబు కృషితో రాష్ట్రానికి అమృత్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించిందని గుర్తుచేశారు. అమృత్ పథకం ద్వారా ఏపీవ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో వచ్చే మూడేళ్లలో ప్రతి ఇంటికీ తాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి నారాయణ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీ లిక్కర్‌ స్కాం ఢిల్లీ స్కాం కంటే పెద్దది: మంత్రి నిమ్మల

రాష్ట్రంలో పాజిటివ్‌ గవర్నెన్స్‌: మంత్రి సత్యప్రసాద్‌

Read latest AndhraPradesh News And Telugu News

Updated Date - Jul 28 , 2025 | 01:47 PM