Share News

Lokesh Helps Family: ఫ్యాక్షన్ బాధిత కుటుంబానికి మంత్రి లోకేష్ అండ

ABN , Publish Date - Jul 17 , 2025 | 03:08 PM

Lokesh Helps Family: రాయలసీమలో ఫ్యాక్షన్ బారిన పడి నష్టపోయిన కుటుంబాలను ఉండవల్లి నివాసానికి పిలుపించుకుని మాట్లాడారు మంత్రి. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.

Lokesh Helps Family: ఫ్యాక్షన్ బాధిత కుటుంబానికి మంత్రి లోకేష్ అండ
Lokesh Helps Family

అమరావతి, జులై 17: ఫ్యాక్షన్ బారిన పడి సర్వం కోల్పోయిన కుటుంబానికి విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) అండగా నిలిచారు. రాయలసీమలో బోయ నరసింహులు కుటుంబం ఫ్యాక్షన్‌ భూతానికి బలి అయ్యింది. ప్రత్యర్థుల చేతుల్లో బోయ నరసింహులు సహా ముగ్గురు కిరాతకంగా హత్యకు గురయ్యారు. ఈ క్రమంలో బోయ నరసింహులు కుటుంబాన్ని మంత్రి లోకేష్.. ఉండవల్లి నివాసానికి పిలుపించుకుని మాట్లాడారు. కుటుంబానికి అండగా ఉంటానని, అన్ని విధాలుగా ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.


కాగా.. రాయలసీమలో ఫ్యాక్షన్ బారిన పడి నష్టపోయిన కుటుంబాలను ఉండవల్లి నివాసానికి పిలుపించుకుని మాట్లాడారు మంత్రి. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గం కామిరెడ్డిపల్లికి చెందిన దాసరి నరసింహులు టీడీపీలో మొదటి నుంచి క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. దీంతో ప్రత్యర్థులు దారి కాచి 2011లో ద్విచక్రవాహనంపై వెళ్తున్న బోయ నరసింహులు సహా అతని కుమారుడు, కుమార్తెను దారుణంగా హత్య చేయడం సంచలనం సృష్టించింది. ఫ్యాక్షన్ బారిన పడి బోయ నరసింహులు కుటుంబం ఎంతో నష్టపోయింది.


lokesh-hami.jpg

అప్పట్లో పార్టీ అధినేత చంద్రబాబు ఆ కుటుంబానికి అండగా నిలిచారు. ఇప్పుడు మృతుడి కుటుంబ సభ్యులను మంత్రి లోకేష్ ఉండవల్లి నివాసానికి ఆహ్వానించారు. అన్ని విధాల అండగా ఉంటానని హామీ ఇచ్చారు. నాటి ఫ్యాక్షన్ హత్యా ఘటనలో రెండు నిలల చిన్నారి మృత్యుంజయుడిగా బయటపడ్డాడు. సదరు బాలుడిని మంత్రి ఆప్యాయంగా పలకరించారు. బాలుడి చదువు వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాగా చదువుకుని ఉన్నతస్థాయికి వెళ్లాలని, తాను కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఉండవల్లి నివాసానికి పిలుపించుకుని తమ యోగక్షేమాలు వాకబు చేయడం పట్ల మంత్రి నారా లోకేష్‌కు బోయ నరసింహులు కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.


ఇవి కూడా చదవండి..

హంద్రీ - నీవా కాల్వలకు నీరు విడుదల

జగన్ వ్యాఖ్యలపై పోలీసు అధికారుల సంఘం ఫైర్

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 17 , 2025 | 04:13 PM