MLA Adinarayana Reddy: బద్వేల్‌లో ఉప ఎన్నిక.. ఆదినారాయణరెడ్డి ఏమన్నారంటే..
ABN , Publish Date - Jul 27 , 2025 | 03:48 PM
కడప జిల్లాలో బద్వేల్ ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉందని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి తెలిపారు. ఒకవేళ ఉప ఎన్నిక వస్తే బీజేపీని గెలిపించుకునేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఏ ఉపఎన్నిక వచ్చినా కూటమి తరపున పోటీ చేసే అభ్యర్థి గెలిచేలా ఉండాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ బలపడాలని, బీజేపీ వాటా బీజేపీకి ఇవ్వాలని కోరారు.

కడప: వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) బీజేపీ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి (MLA Adinarayana Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కాంలో వేల కోట్ల అవినీతికి జగన్ పాల్పడ్డారని ఆరోపించారు. ఇవాళ(ఆదివారం) కడపలో ఆదినారాయణరెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ అరెస్టుకు ముహూర్తం దగ్గర పడిందని చెప్పుకొచ్చారు.
బీజేపీ లేకపోతే, అన్నివిధాలుగా సహకారం ఇవ్వకపోతే కూటమి ప్రభుత్వం స్థిరంగా ఉండే పరిస్థితి కాదని తెలిపారు. కూటమిలో ప్రభుత్వ కార్యక్రమాల్లో బీజేపీకి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ సారథ్యంలో కూటమిలో బీజేపీకి తగిన ప్రాధాన్యం దిశగా ముందుకు వెళ్లాలని కోరారు. కడప జిల్లాలో బద్వేల్ ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఒకవేళ ఉప ఎన్నిక వస్తే బీజేపీని గెలిపించుకునేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి.
ఏ ఉపఎన్నిక వచ్చినా కూటమి తరపున పోటీ చేసే అభ్యర్థి గెలిచేలా ఉండాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ బలపడాలని, బీజేపీ వాటా బీజేపీకి ఇవ్వాలని కోరారు. ఏపీలో అమలవుతున్న ప్రతి సంక్షేమ పథకం వెనుక కేంద్రంలోని మోదీ ప్రభుత్వ సహకారం, నిధుల కేటాయింపు ఉందని స్పష్టం చేశారు. కూటమిలో కీలక భాగస్వామి అయిన జనసేన కూడా బీజేపీకి సహకరించాలని ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఏపీలో పెట్టుబడులకు సింగపూర్ గ్రీన్ సిగ్నల్.. ప్రధానంగా ఈ రంగాల్లో
అబ్దుల్ కలాం వర్ధంతి.. ఆయన సేవలను స్మరించుకున్న చంద్రబాబు నాయుడు, నారా లోకేష్
Read latest AP News And Telugu News