Share News

Pemmasani: అమెరికాలో చంద్రబాబు చాలా మందికి ఫీజులు కడతారు: పెమ్మసాని

ABN , Publish Date - Apr 20 , 2025 | 12:45 PM

Pemmasani Chandrasekhar: ఏపీ సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు వద్ద వ్యక్తిగతంగా నేర్చుకున్న అంశాలు తనకు అమెరికాలో ఎంతో ఉపయోగపడ్డాయని పెమ్మసాని గుర్తు చేసుకున్నారు.

Pemmasani: అమెరికాలో చంద్రబాబు చాలా మందికి ఫీజులు కడతారు: పెమ్మసాని
Pemmasani Chandrasekhar

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని చూసి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉందని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. నారా అంటే ఒక నిలువెత్తు డిక్షనరీ అని అభివర్ణించారు. అమరావతి లాంటి మహా నగర నిర్మాణ ప్రధాత చంద్రబాబు అని ప్రశంసించారు. చంద్రబాబు శ్రమదానం, జన్మభూమి లాంటి కార్యక్రమలు తనలో ఎంతో మార్పు తెచ్చాయని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఉద్ఘాటించారు.


చంద్రబాబు వద్ద వ్యక్తిగతంగా నేర్చుకున్న అంశాలు తనకు అమెరికాలో ఎంతో ఉపయోగపడ్డాయని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గుర్తుచేశారు. ఔటర్ రింగ్ రోడ్డును 70మీటర్ల వెడల్పులో వేయడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇస్తే.. 140 మీటర్ల వెడల్పుకు పెంచాలని చంద్రబాబు అడిగారని అన్నారు. ఇండియాలో ఎక్కువ వెడల్పు ఉండే రోడ్డు కోసం గంటసేపు ప్రయత్నించి సాధించారని చెప్పారు. ఈ విషయంలో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో రాత్రి 1 గంటకు సమావేశం అవుతానని చంద్రబాబు అన్నారని గుర్తుచేసుకున్నారు. అమెరికాలో ఆయన చాలామందికి ఫీజులు కడతారు.. ఈ విషయం చాలా మందికి తెలియదని చెప్పారు. ఒకరిద్దరికీ మాత్రమే దీని గురించి తెలుసని పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పుకొచ్చారు.


చంద్రబాబులో విప్లవధోరణి: రఘురామ

raghuram.jpgసీఎం చంద్రబాబు తత్వాన్ని అర్థం చేసుకున్న.. వారెవరైనా గొప్పగా రాణిస్తారని ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు అన్నారు. చంద్రబాబుకి ఇతర ముఖ్యమంత్రులకు ఉన్న తేడా ఏంటని తనను చాలామంది అడిగారని తెలిపారు. దురాభిమానులు లేకుండా మంచి అభిమానులు ఉన్న ఏకైక నాయకుడు చంద్రబాబు అని తాను చెప్పినట్లు రఘురామ కృష్ణంరాజు చెప్పుకొచ్చారు. పార్టీలో ఉన్న నాయకులందరూ చంద్రబాబు వ్యక్తిత్వాన్ని ప్రేమిస్తారని అన్నారు. చంద్రబాబుకి టైం మేనేజ్మెంట్ తెలియదని తాను కూడా ఒకటికి రెండు సార్లు అనుకున్నానని రఘురామ కృష్ణంరాజు చెప్పారు.


చంద్రబాబు టైం మేనేజ్మెంట్ ఎందుకు పాటించలేకపోతున్నారో.. తాను కనిపెట్టానని రఘురామ కృష్ణంరాజు అన్నారు. ఏదైనా కొత్త విషయం చిన్న కుర్రాడు చెప్పిన నిష్టగా వింటారని.. అంతగా టైం మర్చిపోతారని తెలిపారు. ఆయన నిత్యవిద్యార్థిగా కొత్త విషయాలు నేర్చుకుంటారని చెప్పుకొచ్చారు. టైం మేనేజ్మెంట్ విషయంలో ఒకరిద్దరికీ ఇబ్బంది కలిగిన రాష్ట్ర ప్రజలకు భవిష్యత్తులో ఎంతో మేలు జరుగుతుందని స్పష్టం చేశారు. నిజంగా టైం ట్రావెల్ చేయగల నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు మాత్రమేనని రఘురామ కృష్ణంరాజు ఉద్ఘాటించారు.


చంద్రబాబుని ఎంత వ్యతిరేకించేవారైనా సరే.. ఆక్ష్న విజన్‌ని అంగీకరించి తీరాల్సిందేనని రఘురామ కృష్ణంరాజు స్పష్టం చేశారు. ఇలాంటి గొప్ప నాయకుడితో పనిచేయడం కాస్తా ఆలస్యమైనా.. ఇప్పుడు అవకాశం రావడంతో తనకు ఎంతో సంతోషంగా ఉందని వెల్లడించారు. విజనరీ లీడర్‌కు ఈ సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మహాత్మా గాంధీలో ఉన్న సుగుణం.. ఓర్పు, సుభాష్ చంద్రబోస్‌లోని విప్లవ ధోరణిని మనం చంద్రబాబులో చూస్తామని వ్యాఖ్యానించారు. అయితే చంద్రబాబులో ఎక్కువగా ఓర్పు, సహనమే మనం చూస్తామని.. అప్పుడప్పుడు విప్లవధోరణి కూడా బయటపడుతోందని చెప్పుకొచ్చారు. చంద్రబాబు విదేశాలు వెళ్తే అక్కడ నుంచి కూడా వీడియో కాన్ఫరెన్స్ ,టెలికాన్ఫరెన్స్‌లతో మాట్లాడి ఏపీకి సంబంధించిన విషయాలు తెలుసుకుంటారని రఘురామ కృష్ణంరాజు చెప్పుకొచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Megastar Chiranjeevi: సీఎం చంద్రబాబుకు మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే విషెస్

సీఎం చంద్రబాబుకు గవర్నర్, పవన్ జన్మదిన శుభాకాంక్షలు

Narayana Team: గుజరాత్‌లో మంత్రి నారాయణ బృందం పర్యటన

AP High Court: అభ్యర్థుల వయోపరిమితి పెంచాలని ఆదేశించలేం

For More AP News and Telugu News

Updated Date - Apr 20 , 2025 | 01:07 PM