Home » Raghu Rama Krishnam Raju
సుహాస్ వంటి వారిని స్ఫూర్తిగా తీసుకుని యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అన్నారు.
ఏపీలో 2047 నాటికి పేదరికాన్ని నిర్మూలించడమే లక్ష్యంగా ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చిన పీ4 (ప్రభుత్వ, ప్రైవేటు, ప్రజల భాగస్వామ్యం) పథకంలో ప్రవాస భారతీయులు భాగస్వాములు కావాలని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అన్నారు.
అసెంబ్లీ పిటిషన్ల కమిటీకి, ప్రభుత్వానికి సంబంధం లేదని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు అన్నారు. ప్రజా సమస్యల స్వీకారం, జనంలో చైతన్యం తీసుకొచ్చే క్రమంలో సర్కారుపై వాచ్‌డాగ్‌లాగా ఈ కమిటీ ఉంటుందని, ఇది లోక్‌పాల్‌వంటిదని తెలిపారు.
ఏపీలో ఆన్‌లైన్ జూదం నివారణకు ఎలాంటి చట్టాలు అమలు చేయాలనే విషయంపై చర్చించామని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణమరాజు తెలిపారు. శాసనసభ పనిదినాలు పెంచాలనే పిటిషన్‌లు కూడా ప్రజల నుంచి వస్తున్నాయని వెల్లడించారు. ఇకపై ప్రతీ 15రోజులకోసారి పిటిషన్ల కమిటీ సమావేశమై ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని కృష్ణమరాజు అన్నారు.
వైసీపీ నేతలు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే తరిమికొడతారని ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు హెచ్చరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిని దేవతల రాజధాని అన్నారని.. ఈ విషయాన్ని జగన్ జీర్ణించుకోలేకపోతున్నారని రఘురామ మండిపడ్డారు.
జగన్ నిర్వహించిన వెన్నుపోటు దినం ప్రజలపై ప్రతీకార చర్యగా ఉందని డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు విమర్శించారు. సంఘ విద్రోహ శక్తులతో జగన్ సానుభూతి చూపుతున్నారని ఆరోపించారు.
రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు, రేషన్ కార్డు మరియు ఆరోగ్యశ్రీ కార్డులను విడిగా ఇవ్వాలన్న డిప్యూటీ స్పీకర్ రఘురామ సూచించారు. అవసరం లేని వారు రేషన్ కార్డును స్వచ్ఛందంగా వెనక్కి ఇచ్చితే ప్రభుత్వానికి రూ.2 వేల కోట్ల భారం తగ్గుతుందన్నారు.
హెల్త్ కార్డ్ కోసం కొంతమంది నకిలీ ధ్రువపత్రాలు ఇచ్చి మరి తెల్లరేషన్ కార్డు తీసుకుంటున్నారని.. అలా చేయొద్దని ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కోరారు. హెల్త్ కార్డ్ ఉన్న ప్రతి పౌరుడికి రూ. 25 లక్షలు కవరయ్యేలా చూడాలని ఏపీ ప్రభుత్వం భావిస్తుందని రఘురామకృష్ణంరాజు తెలిపారు.
Raghurama: ప్రజా ఫిర్యాదులపై ఈ శాసనసభ కమిటీ మొదటి సమావేశం విశాఖలో ఏర్పాటు చేశామని ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు అన్నారు. ఆ కమిటీ విధి విధానాలపై ప్రజలు, ఎమ్మెల్యేలకు కూడా అవగాహన లేదని చెప్పారు. ఈ కమిటీని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు మీడియా ముందుకు వచ్చామని రఘురామరాజు తెలిపారు.
అమరావతి నిర్మాణానికి చంద్రబాబు అనివార్యుడని నేతలు అభినందిస్తూ, ఆయన అసెంబ్లీ ప్రసంగాలను రెండు పుస్తకాలుగా ఆవిష్కరించారు. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఆయన జన్మదినాన్ని సేవా కార్యక్రమాలతో ఘనంగా జరిపారు