Raghuramakrishna Raju: రఘురామకృష్ణం రాజుపై థర్డ్ డిగ్రీ .. సీఐడీ మాజీ ఏడీజీ సునీల్ కుమార్‌కు నోటీసులు..
ABN , Publish Date - Nov 26 , 2025 | 06:51 PM
రఘురామకృష్ణం రాజుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఐడీ మాజీ ఏడీజీ పీవీ సునీల్ కుమార్‌కు నోటీసులు జారీ అయ్యాయి.
అమరావతి: రఘురామకృష్ణం రాజుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన కేసులో సీఐడీ మాజీ ఏడీజీ పీవీ సునీల్ కుమార్‌కు నోటీసులు జారీ అయ్యాయి. డిసెంబర్ 4వ తేదీన విచారణకు రావాలని ఎస్పీ దామోదర్ నోటీసులు పంపారు. గుంటూరు సీసీఎస్‌కు రావాలని ఆదేశించారు. ఇప్పటికే ఈ కేసులో అప్పటి దర్యాప్తు అధికారి విజయపాల్, టీడీపీ నేత తులసిని పోలీసులు అరెస్ట్ చేశారు.
కాగా, అప్పటి సీఎం జగన్‌మోహన్ రెడ్డిపై రఘురామకృష్ణం రాజు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ 2021లో ఆయనపై సీఐడీ అధికారులు దేశద్రోహం కింద కేసు నమోదు చేశారు. ఆ ఏడాది మే 14వ తేదీన రఘురామ జన్మదినం రోజునే ఆయన్ను హైదరాబాద్ నుంచి బలవంతంగా గుంటూరు సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి తీసుకొచ్చారు. ఆరోజు రాత్రి కస్టడీలో తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి హత్యాయత్నానికి పాల్పడినట్లు రఘురామరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత సంవత్సరం జూలై 11న గుంటూరు నగరంపాలెం పోలీసు సేషన్లో కేసు నమోదైంది.
ఇవి కూడా చదవండి
పంచాయతీ రిజర్వేషన్లపై హైకోర్టును ఆశ్రయించిన గ్రామస్తులు
ఎన్ఐఏ కస్టడీకి ఢిల్లీ పేలుడు కేసు నిందితులు