Share News

YSRCP Activist: రఘురామపై అనుచిత పోస్టులు.. వైసీపీకి చెందిన యువకుడు అరెస్టు

ABN , Publish Date - Oct 26 , 2025 | 09:47 PM

వైసీపీ శ్రేణులు యథేచ్ఛగా రెచ్చిపోతున్నాయి. జగన్ హయాంలో సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పోస్టులు పెట్టి ప్రతిపక్షాల నేతలను ఇబ్బందులకు గురిచేశాయి. కూటమి ప్రభుత్వంలోనూ టీడీపీ నేతలపై వైసీపీ శ్రేణులు అభ్యంతరకరంగా పోస్టులు పెడుతున్నాయి.

YSRCP Activist: రఘురామపై అనుచిత పోస్టులు.. వైసీపీకి చెందిన యువకుడు అరెస్టు
YSRCP Activist

ఎన్టీఆర్ జిల్లా, అక్టోబరు26(ఆంధ్రజ్యోతి): వైసీపీ (YSRCP) శ్రేణులు యథేచ్ఛగా రెచ్చిపోతున్నాయి. జగన్ హయాంలో సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పోస్టులు పెట్టి ప్రతిపక్షాల నేతలను ఇబ్బందులకు గురిచేశాయి. కూటమి ప్రభుత్వంలోనూ టీడీపీ నేతలపై వైసీపీ శ్రేణులు అభ్యంతరకరంగా పోస్టులు పెడుతున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, తెలుగుదేశం పార్టీ ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishna Raju)పై సోషల్ మీడియాలో వైసీపీకి చెందిన యువకుడు అంబోజి వినయ్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు.


అంబోజి వినయ్ జగ్గయ్యపేట మండలం మల్కాపురం గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. రఘురామపై అనుచిత వ్యాఖ్యల విషయం పోలీసుల దృష్టికి రావడంతో వెంటనే రంగంలోకి దిగారు. సదరు యువకుడిని పట్టుకునేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. అంబోజి వినయ్‌ హైదరాబాద్‌లో ఉన్నట్లు పశ్చిమగోదావరి జిల్లా పోలీసులకి సమాచారం అందింది. వెంటనే సదరు యువకుడిని పోలీసులు హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. అంబోజి వినయ్‌ని పోలీసులు విచారణ చేస్తున్నారు. సోషల్ మీడియాలో రాజకీయ నేతలని అభ్యంతరకరంగా విమర్శిస్తే చూస్తూ ఊరుకోమని పోలీసులు హెచ్చరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కర్నూలు బస్సు ప్రమాదం.. బ్లూ మీడియాపై ప్రభుత్వం సీరియస్

పరకామణి వ్యవహారంలో నిందితులను వదిలిపెట్టం.. భానుప్రకాష్ వార్నింగ్

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 26 , 2025 | 09:57 PM