Share News

Pemmasani Chandrasekhar: ఏపీ లిక్కర్ స్కామ్‌ కేసులో బిగ్‌బాస్‌ అరెస్ట్ ఖాయం

ABN , Publish Date - Aug 02 , 2025 | 02:39 PM

తమ ప్రభుత్వంలో సూపర్ సిక్స్‌తో పాటు అన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఉద్ఘాటించారు. అన్నదాత సుఖీభవ, ఉచిత గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం, పథకాలకు యాభై వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని వివరించారు. గత జగన్ ప్రభుత్వంలో రూ.1000లు పింఛన్ పెంచడానికే ఐదేళ్లు పట్టిందని కేంద్ర మంత్రి పెమ్మసాని విమర్శించారు.

Pemmasani Chandrasekhar: ఏపీ లిక్కర్ స్కామ్‌ కేసులో బిగ్‌బాస్‌ అరెస్ట్ ఖాయం
Union Minister Pemmasani Chandrasekhar

గుంటూరు జిల్లా: వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ (Pemmasani Chandrasekhar) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ లిక్కర్ స్కామ్‌ కేసులో బిగ్‌బాస్ జగన్‌ను కూడా ఆధారాలు దొరకగానే సిట్ అధికారులు అరెస్ట్ చేస్తారని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఏపీలో లిక్కర్ స్కామ్ జరిగిందని అందరికీ తెలుసునని చెప్పుకొచ్చారు. ఈ స్కాంలో ఆధారాలు లేకుండా వైసీపీ ఎంపీ మిధున్‌ రెడ్డిని అరెస్టు చేయరని తెలిపారు. ఈ స్కామ్‌లో సిట్ అధికారులు అన్ని ఆధారాలు సేకరిస్తుందని వెల్లడించారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్.


ఇవాళ(శనివారం) గుంటూరు జిల్లాలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో పెమ్మసాని మాట్లాడారు. తమ ప్రభుత్వంలో సూపర్ సిక్స్‌తో పాటు అన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని ఉద్ఘాటించారు. అన్నదాత సుఖీభవ, ఉచిత గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం, పథకాలకు రూ.50,000ల కోట్లు ఖర్చు చేస్తున్నామని వివరించారు. గత జగన్ ప్రభుత్వంలో రూ.1000లు పింఛన్ పెంచడానికే ఐదేళ్లు పట్టిందని విమర్శించారు. గత వైసీపీ ప్రభుత్వం రైతు భరోసా కింద రూ. 13000 మాత్రమే ఇచ్చిందని గుర్తుచేశారు. తమ ప్రభుత్వం అన్నదాత సుఖీభవలో రూ. 20,000 ఇస్తున్నామని వెల్లడించారు. కేంద్రం ప్రభుత్వంతో కలిపి అన్నదాత సుఖీభవ మూడు విడతల్లో ఇస్తున్నామని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం ఎక్కడ హామీలు అమలు చేయలేదో చెప్పాలని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రశ్నించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

ఈ రోజు నాకెంతో స్పెషల్: మంత్రి నారా లోకేష్

గత పాలన సైకో పాలన.. ఆర్థిక విధ్వంసం చేసి అందరినీ ఇబ్బంది పెట్టారు

Read Latest AP News and National News

Updated Date - Aug 02 , 2025 | 03:05 PM