Share News

Kanna Slams Jagan: ఓదార్పుకు కాదు.. యుద్ధానికి వెళ్లినట్టుంది.. జగన్‌పై కన్నా సెటైర్

ABN , Publish Date - Jun 19 , 2025 | 11:32 AM

Kanna Slams Jagan: నూటికి నూరు పాళ్ళు నాగమల్లేశ్వరావు ఆత్మహత్యకు జగనే కారణమని ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. నాగమల్లేశ్వరావు ఆత్మహత్యకు పోలీస్ వేధింపులనేది అసత్యమన్నారు.

Kanna Slams Jagan: ఓదార్పుకు కాదు.. యుద్ధానికి వెళ్లినట్టుంది.. జగన్‌పై కన్నా సెటైర్
Kanna Laxminarayana

గుంటూరు, జూన్ 19: మాజీ సీఎం జగన్ (Former CM YS Jagan Mohan Reddy) పల్నాడు పర్యటనలో జరిగిన అరాచకాలపై టీడీపీ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ (TDP MLA Kanna Laxminarayana) స్పందిస్తూ మాజీ సీఎంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. నాగమల్లేశ్వరావు ఎందుకు చనిపోయాడో జగన్ పర్యటనకు ముందే తాను చెప్పానని.. అయినప్పటికీ జగన్ ఓదార్పుకు వెళ్ళినట్లు లేదని.. పల్నాడుపై యుద్దం ప్రకటించి యుద్దానికి వెళ్ళినట్లు ఉందని వ్యాఖ్యలు చేశారు. గజమాలలు, సన్మానాలు ఒక పక్క.. చంపుతాం, నరుకుతాం అంటూ మరో పక్క ప్లకార్డ్స్ పెట్టారన్నారు. జగన్ ది రాక్షస పాలన అని గతంలోనే చెప్పానని.. ఇప్పటికీ జగన్‌లో మార్పు రాలేదని విమర్శించారు. నిన్న పల్నాడులో అరాచక ర్యాలీ నిర్వహించారన్నారు.


నూటికి నూరు పాళ్ళు నాగమల్లేశ్వరావు ఆత్మహత్యకు జగనే కారణమని ఆరోపించారు. నాగమల్లేశ్వరావు ఆత్మహత్యకు పోలీస్ వేధింపులనేది అసత్యమన్నారు. పెద నెమలిపురికి చెందిన లక్ష్మీ నారాయణ కూడా అప్పుల బాధ తాళలేక సూసైడ్ అటెంప్ట్ చేశారన్నారు. లక్ష్మీ నారాయణ తల్లికి టీడీపీ సభ్యత్వం ఉందని తెలిపారు. అరాచక ర్యాలీ, పైశాచిక ప్రవర్తనతో ఇద్దరు చనిపోయారని మండిపడ్డారు. జగన్ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది అంటూ సెటైర్ వేశారు. జగన్ రాక్షస పాలనలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ను బయటకు రాకుండా అడ్డుకున్నారని గుర్తుచేశారు. జగన్ బెదిరింపులకు భయపడేవారు ఎవరూ లేరని స్పష్టం చేశారు.


కమ్మ వాళ్ళపై ద్వేషమే 2024లో శాపమై చుట్టుకుందన్నారు. అబద్దపు మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని తెలిపారు. జగన్ ఎన్ని నాటకాలు ఆడినా, డ్రామాలు వేసినా ప్రజలు పట్టించుకోరని అన్నారు. కమ్మ వారిపై ద్వేషంతోనే అమరరాజాను తరిమేశారని ఆరోపించారు. వైసీపీ నాయకులు బారికేడ్లను తొలగించి నిబంధనలు ఉల్లంఘించారని మండిపడ్డారు. నిన్న ఇద్దరి మృతికి జగనే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఏడాది క్రితం చనిపోయిన వారిని పరామర్శిస్తారు కానీ ర్యాలీలో చనిపోయిన వారి కుటుంబాలను కనీసం పలకరించే సమయం జగన్‌కు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.


కమ్మ సామాజిక వర్గం గురించి మొసలి కన్నీరు కార్చారన్నారు. కమ్మ నాయకులను ఏవిధంగా వాడుకున్నావో అందరికీ తెలుసన్నారు. కమ్మ వాళ్ళు అనుభవిస్తున్న దానికి జగన్ పైశాచిక ప్రవర్తనే కారణమని ఆరోపించారు.సైకో కళ్ళలో ఆనందం కోసం కమ్మ వాళ్ళను కమ్మవాళ్ళ చేతే తిట్టించారన్నారు. అసెంబ్లీని కౌరవ సభ చేశారని విమర్శించారు. కమ్మ వాళ్ళ మీద ఉన్న ద్వేషంతో జగన్ తమ ప్రాంతాన్ని సర్వ నాశనం చేశారని.. అమరావతిని సర్వనాశనం చేశారని ఎమ్మెల్యే కన్నా లక్ష్మీ నారాయణ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.


ఇవి కూడా చదవండి

వివాదాస్పద ప్లకార్డులు.. వైసీపీ కార్యకర్త అరెస్ట్

ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది మృతి

యుద్ధం నేనే ఆపా!

Read latest AP News And Telugu News

Updated Date - Jun 19 , 2025 | 06:17 PM