Share News

YSRCP Placard Controversy: వివాదాస్పద ప్లకార్డులు.. వైసీపీ కార్యకర్త అరెస్ట్

ABN , Publish Date - Jun 19 , 2025 | 10:37 AM

YSRCP Placard Controversy: పల్నాడు పర్యటనలో భాగంగా జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ అరాచకం అడుగడుగునా కనిపించింది. ఏడాది కిందట వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందంటూ బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకుని ఆత్మహత్య చేసుకున్న నాయకుడి కుటుంబాన్ని ఇప్పుడు పరామర్శించారు జగన్‌.

YSRCP Placard Controversy: వివాదాస్పద ప్లకార్డులు.. వైసీపీ కార్యకర్త అరెస్ట్
YSRCP Placard Controversy

పల్నాడు జిల్లా, జూన్ 19: సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి (Former CM YS Jaganmohan Reddy) పర్యటన సందర్భంగా ఆ పార్టీ కార్యకర్తలు ప్రదర్శించిన ప్లకార్డులు వివాదాస్పదంగా మారాయి. రప్పా.. రప్పా నరుకుతామంటూ ప్లకార్డులు ప్రదర్శించడం పట్ల టీడీపీ నేతలు సీరియస్ అయ్యారు. వారి ఫిర్యాదు మేరకు ఈ ప్లకార్డులు ప్రదర్శించిన వారిపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. రవితేజ అనే వైసీపీ కార్యకర్త ప్లకార్డులను ప్రదర్శించినట్లు గుర్తించిన పోలీసులు.. అతడిని అదుపులోకి తీసుకున్నారు. రవితేజ 88 తాళ్లూరు గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. జగన్ పర్యటనలో ఇలాంటి ప్లకార్డుల ప్రదర్శనను వ్యతిరేకిస్తూ సత్తెనపల్లి టీడీపీ నాయకులు, తెలుగు మహిళల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. రవితేజను అరెస్ట్ చేసిన పోలీసులు.. నకరికల్లు పోలీస్ స్టేషన్‍‌లో ప్రశ్నిస్తున్నారు.


పల్నాడు పర్యటనలో భాగంగా జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ అరాచకం అడుగడుగునా కనిపించింది. ఏడాది కిందట.. వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందంటూ బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకుని ఆత్మహత్య చేసుకున్న నాయకుడి కుటుంబాన్ని జగన్‌ ఇప్పుడు పరామర్శించారు. అందుకోసం వందలాది వాహనాలు, వేలాది మంది కార్యకర్తలతో రెంటపాళ్లకు వెళ్లారు. ఈ క్రమంలో ప్రతీ చోట వైసీపీ మూకలు వీరంగం సృష్టిస్తూనే ఉన్నాయి. జగన్‌ పర్యటనకు వందమందికి మాత్రమే అనుమతని పోలీసులు చెప్పినప్పటికీ వాటిని బేఖాతరు చేస్తూ బలప్రదర్శనకు దిగారు. అంతేకాకుండా వివాదస్పద ప్లకార్డులను ప్రదర్శించారు. చంపుతాం, నరుకుతామంటూ ప్లకార్డులను ప్రదర్శిస్తూ వీరంగం సృష్టించారు.


ప్లకార్డుల్లో ఏముందంటే..

‘మళ్లీ అధికారంలోకి వచ్చాక... చంపేస్తాం, నరికేస్తాం’... ‘ఎవడైనా రానీ.. తొక్కి పడేస్తాం! 2029లో వైఎస్సార్‌సీపీ వచ్చిన వెంటనే.. గంగమ్మతల్లి జాతరలో వేట తలలు నరికినట్టు.. రప్పా రప్పా నరుకుతాం నా కొడకల్లారా! వైఎస్‌ రాజారెడ్డి రాజ్యాంగం పల్నాడు నుంచి మొదలు, అన్న వస్తాడు.. అంతు చూస్తాడు!’ అంటూ వైసీపీ కార్యకర్తలు ప్లకార్డులు, ఫ్లెక్సీలు ప్రదర్శించారు. ఇలాంటి రాతలపై టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ప్రతిపక్ష హోదా లేకున్నా జగన్, వైసీపీ నేతలు ఇలాంటి దౌర్జన్యాలకు పాల్పడం దారుణమంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


మరోవైపు పోలీసులపై దురుసుగా ప్రవర్తించారంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు చేసిన పోలీసులు.. సత్తెనపల్లి వైసీపీ ఇన్ ఛార్జ్ గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డిపై మరో కేసు నమోదు చేశారు. జగన్ పర్యటనలో అనుమతి లేకుండా ర్యాలీ, డీజే స్టాండ్ ఏర్పాటుపై కేసు నమోదు అయ్యింది. పోలీస్ 30యాక్ట్ అమలవుతున్నప్పటికీ వైసీపీ నేతలు ర్యాలీ నిర్వహించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.


ఇవి కూడా చదవండి

రంగంలోకి కేంద్రం.. ఇరాన్ నుంచి భారత్‌కు 110 మంది విద్యార్థుల తరలింపు

ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది మృతి

యుద్ధం నేనే ఆపా!

Read latest AP News And Telugu News

Updated Date - Jun 19 , 2025 | 06:11 PM