Liquor scam: జైలుకు వెళ్లే సమయంలో చెవిరెడ్డి నినాదాలు..
ABN , Publish Date - Jun 19 , 2025 | 07:21 AM
AP liquor scam: ఏపీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఏసీబీ న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించడంతో పోలీసులు ఆయనను విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. ఆ సమయంలో చెవిరెడ్డి హంగామా చేశారు.

విజయవాడ: ఏపీ మద్యం కుంభకోణం కేసు (AP liquor scam Case)లో బెంగళూరులో అరెస్టయిన వైసీపీ కీలక నేత (YCP Leader), మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి (Chevireddy Bhaskara Reddy)ని విజయవాడలో వైద్య పరీక్షల అనంతరం పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. విచారణ జరిపిన ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ (Remand) విధించింది. దీంతో చెవిరెడ్డిని పోలీసులు విజయవాడ జిల్లా జైలు (Vijayawada Jail)కు తరలించారు. జైలు లోపలకు వెళ్లే సమయంలో కూడా చెవిరెడ్డి నినాదాలు చేశారు. తనపై తప్పుడు కేసులు బానాయించి హింసించి జైలులో పెట్టి రాక్షసానందం పొందుతున్నారని, వారు కూడా తమ ప్రభుత్వం వచ్చాక ఇదే జైలులో ఉండాల్సి వస్తుందని అన్నారు. ఆ సమయం త్వరలోనే ఉందని అరుచుకుంటూ జైలు లోపలకి అడుగు పెట్టారు.
ఏ-38గా చెవిరెడ్డి..
కాగా మద్యం కుంభ కోణం కేసులో ఏ-34గా చెరుకూరు వెంకటేష్ నాయుడు, ఏ-38గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేర్లను పోలీసులు ఎఫ్ఐఆర్‌లో చేర్చారు. అయితే చెవిరెడ్డికి నడుము నొప్పి కారణంగా కాట్, బెడ్, పిల్లో, మస్కటో నెట్ అవకాశం కల్పించేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు చెవిరెడ్డి కుటుంబ సభ్యులు జైలు వద్ద ఆయనకు అందచేశారు. మరోవైపు మద్యం కమిషన్లను చెవిరెడ్డి ఎన్నికల్లో అభ్యర్థులకు పంపిణీ చేశారని ఇప్పటికే సిట్ నిర్ధారించింది.
అభ్యర్థులకు డబ్బుల పంపిణీ..
ఈ డబ్బు అందుకున్న చెవిరెడ్డి ఆ మొత్తాన్ని కొంతమందికి పంపిణీ చేసినట్టు సిట్ వద్ద సమాచారం ఉంది. ఇందులో కొంత చంద్రగిరి నుంచి పోటీ చేసిన తన కుమారుడు మోహిత్ రెడ్డికి ఇచ్చినట్టు సిట్ గుర్తించింది. మరి కొంత డబ్బును గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన మరో మాజీ ఎంపీకు ఇచ్చినట్టు సిట్ వద్ద ఆధారాలు ఉన్నాయి. ఆ మాజీ ఎంపీని కూడా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చే అవకాశం ఉంది.
ఇప్పటి వరకు 7గురు అరెస్టు..
కాగా.. మద్యం కుంభకోణం కేసులో ఇప్పటి వరకు ఏడుగురిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, దిలీప్, చాణక్య, ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలను సిట్ అరెస్ట్ చేసి.. కస్టడీలోకి తీసుకుని విచారించింది. వారి నుంచి వచ్చిన సమాచారం మేరకు మిథున్ రెడ్డి పాత్ర కూడా చాలా ప్రముఖంగా ఉన్నట్లు నిర్ధారించారు. అయితే ఆయన హైకోర్టులో ముందస్తుగా బెయిల్ పిటిషన్ వేయడంతో వాదనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రూ.5 కోట్లు మిథున్ రెడ్డి ఖాతాలో జమచేసినట్లు సిట్ అధికారులు గుర్తించి ఆ వివరాలను హైకోర్టుకు సమర్పించారు. ఈ పరిణామాల నేపథ్యంలో అనూహ్యంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. కేసిరెడ్డితో మాజీ ఎమ్మెల్యే పలు దఫాలుగా సమావేశం అవడంతో పాటు ఎన్నికల ముందు కేసిరెడ్డి నుంచి కొన్ని కోట్ల రూపాయలు తీసుకున్నట్లు సిట్ గుర్తించింది. ఒంగోలు ఎంపీగా పోటీ చేసిన సమయంలో, అతడి కుమారుడు ఎమ్మెల్యేగా పోటీ చేసిన సమయంలో, మాజీ ఎంపీకి కూడా డబ్బులు పంపిణీ చేయడంలో చెవిరెడ్డి పాత్ర ఉన్నట్లు సిట్ అధికారులు నిర్ధారించారు.
ఇవి కూడా చదవండి:
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో కుట్ర కోణం
For More AP News and Telugu News