Home » Police case
కూటమి ప్రుభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ హయాంలో జరిగిన పాపాలను పోలీసులు ఇప్పుడు బయటకు తీస్తున్నారు. కేసుల ఆధారంగా చర్యలు తీసుకుంటున్నారు. అనకాపల్లిలో గతంలో టీడీపీ నేతను కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురిచేసిన ఘటనలో వైసీపీకి చెందిన ముగురిని పోలీసులు అరెస్టు చేశారు.
గౌతమ్ గంభీర్‌ను చంపేస్తానంటూ బెదిరించిన ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. గౌతమ్ గంభీర్‌ను చంపేస్తానంటూ బెదిరించిన ఇంజినీరింగ్ విద్యార్థిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. గౌతమ్ గంభీర్‌కు బెదిరింపు మెయిల్స్ పంపిన గుజరాత్‌కు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి జిగ్నేశ్ సిన్హ్ పర్మార్ (21)గా పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు.
ప్రేమ వివాహం చేసుకున్న మహేష్ అనే వ్యక్తి మియాపూర్‌లో కాపురం పెట్టి క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అయితే గత కొంత కాలంగా భార్య, భర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి భార్య, అత్తపై మహేష్ కత్తితో దాడి చేశాడు.
మద్యం కుంభకోణం కేసులో అరస్టయిన రాజ్ కసిరెడ్డిని సెట్ అధికారులు విజయవాడలోని విచారిస్తున్నారు. సోమవారం సాయంత్రం అత్యంత నాటకీయ పరిణామాల మధ్య రాజ్ కసిరెడ్డిని హైదరాబాద్ (శంషాబాద్) విమానాశ్రయంలో పోలీసులు అరెస్టు చేశారు. రాత్రికి రాత్రి ఆయనను విజయవాడకు తరలించారు.
హైదరాబాద్ కాచిగూడలో భారీ దోపిడీ జరిగింది. ప్రముఖ వ్యాపారవేత్త హేమరాజు ఇంట్లో బంగారు ఆభరణాలు, పెద్ద మొత్తంలో నగదు ఎత్తుకుపోయారు. ఇంట్లో పని మనుషులు వ్యాపారవేత్త హేమరాజు దంపతులకు రాత్రి భోజనంలో మత్తుమందు కలిపి పెట్టారు. అది తిన్న దంపతులిద్దరు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు.
టీటీడీ గోశాలలో వందకుపైగా ఆవులు మృతి చెందాయన్న వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణల నేపథ్యంలో వివాదం రాజుకుంది. గోవుల మృతిపై భూమన ప్రెస్ మీట్లో అసత్య ప్రచారం చేస్తున్నారంటూ భానుప్రకాష్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో భూమనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ముద్దాయి మాదిరిగా స్టేషన్ గేట్లకు బేడీలు వేయడం ఏంటని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ ఘటనపై గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చరిత్రలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి చూడలేదని అన్నారు.
గోళ్లు పెద్దవిగా పెంచుతున్నారా.. స్టైల్‌గా ఉందిలే అనుకుంటున్నారా.. జర జాగ్రత్త మీ గోళ్ల కారణంగా ఎవరైనా గాయపడితే చట్ట ప్రకారం మీరు శిక్షార్హులవుతారు. ఎవరైనా వ్యక్తులు తమపై ఇతర వ్యక్తులు తమ గోళ్లతో దాడి చేశారని ఫిర్యాదు చేస్తే తప్పకుండా కేసులు నమోదు చేస్తారు.
మతాంతర వివాహం చేసుకున్న ఓ యవతి కన్నవారింట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. దీంతో ఇది పరువు హత్యేనని, తన భార్యను ఆమె కన్నవారే చంపేశారని మృతురాలి భర్త ఆరోపిస్తున్నాడు. చిత్తూరులో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గోరంట్ల మాధవ్‌పై తాడేపల్లి పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదు అయింది. ఐటీ విద్య శాఖల మంత్రి నారా లోకేష్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీంతో టీడీపీ నేతలు తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై గోరంట్లకు నోటీసులు ఇచ్చే అవకాశముంది.