EX Minister Perni Nani: పేర్ని నానిపై కేసు నమోదు..
ABN , Publish Date - Jul 12 , 2025 | 07:03 PM
మాజీ మంత్రి పేర్ని నానిపై కృష్ణా జిల్లా అవనిగడ్డ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అవనిగడ్డ, పామర్రు నియోజకవర్గాల్లో జరిగిన వైసీపీ కార్యకర్తల సమావేశాల్లో రప్పా రప్పా అనటం కాదు చేసి చూపించండి.. అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

మాజీ మంత్రి పేర్ని నానిపై కృష్ణా జిల్లా అవనిగడ్డ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అవనిగడ్డ, పామర్రు నియోజకవర్గాల్లో జరిగిన వైసీపీ కార్యకర్తల సమావేశాల్లో రప్పా రప్పా అనటం కాదు చేసి చూపించండి.. అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. పేర్ని నాని వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ రాష్ట్ర నేత కనపర్తి శ్రీనివాసరావు.. అవనిగడ్డ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన మాట్లాడుతూ బియ్యం దొంగ పేర్ని నాని.. శాంతిభద్రతలకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వెంటనే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. మరోవైపు పేర్ని నాని వ్యాఖ్యలపై అవనిగడ్డ నియోజకవర్గ టీడీపీ, జనసేన పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కృష్ణా జిల్లాలో నిర్వహించిన బాబు ష్యూరిటీ మోసం కార్యక్రమాల్లో మాజీ మంత్రి పేర్ని నాని (EX Minister Perni Nani) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘లోకేష్ రెడ్ బుక్ అంటే.. మీరు రప్పా రప్పా అంటున్నారు.. ఏదైనా చేయాలంటే చీకట్లో కన్నుకొడితే అయిపోవాలే తప్ప.. రప్పా రప్పా అని అనటం కాదు.. అంటూ కార్యకర్తలకు సూచించారు. ఈ వ్యాఖ్యలు వైరల్ కావడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
పేర్నినాని అక్కడికి వెళ్లు.. నీ రప్పా..రప్పా సంగతి వాళ్లే చూస్తారు: బోడె ప్రసాద్
అర్చక నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన మంత్రి ఆనం
Read Latest AP News And Telugu News