Home » Kanna Lakshminarayana
సత్తెనపల్లి, జూన్ 19(ఆంధ్రజ్యోతి): ‘మాజీ సీఎం వైఎస్ జగన్ రెంటపాళ్ల ఓదార్పుకు వెళ్లినట్టుగా లేదు. పల్నాడుపై యుద్ధానికి వెళ్లినట్లుంది’ అని ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అన్నారు.
Kanna Slams Jagan: నూటికి నూరు పాళ్ళు నాగమల్లేశ్వరావు ఆత్మహత్యకు జగనే కారణమని ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. నాగమల్లేశ్వరావు ఆత్మహత్యకు పోలీస్ వేధింపులనేది అసత్యమన్నారు.
Somireddy Slams Jagan: కాంగ్రెస్‌ను అడ్డం పెట్టుకుని వేల కోట్లు సంపాదించి.. అదే కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచారంటూ జగన్‌పై ఎమ్మెల్యే సోమిరెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి ప్రజలను వెన్నుపోటు పొడిచారని.. వెన్నుపోటు దినోత్సవం జరుపుకునే అర్హత జగన్‌కు లేదన్నారు.
పల్నాడు జిల్లా: సత్తెనపల్లిలో అన్న క్యాంటీన్ పనులను ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ గురువారం ఉదయం పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పేదల ఆకలి తీర్చాలని అన్న క్యాంటీన్లు పెట్టిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడుదే అన్నారు. తెలుగుదేశం హయాంలో పేదలకు అనేక సంక్షేమ పథకాలు అందుతున్నాయని, అన్న క్యాంటిన్‌లలో ఐదు రుపాయలకే భోజనం ఏర్పాటు చేశారన్నారు.
సత్తెనపల్లి(Sathenapalli)లో మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణ(Kanna Lakshminarayana) కార్యాలయం వద్ద అర్ధరాత్రి యువకులు హల్చల్ చేశారు. మద్యం మత్తులో ఆఫీస్ వాచ్‌మెన్(Watchman)పై దాడికి పాల్పడ్డారు. కార్యాలయం తగలపెడతామంటూ వార్నింగ్ ఇచ్చారు. దాడితో భయపడిన వాచ్‌మెన్ కొండలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ(YSRCP) పలు అక్రమాలకు పాల్పడుతోంది. ఎన్నికల సంఘం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఆ పార్టీ నేతల్లో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు. మరోసారి ఎలాగైనా అధికారంలోకి రావడానికి వైసీపీ పలు కుట్రలకు పాల్పడుతోంది. ఇందులో భాగంగానే పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లి నియోజకవర్గంలో మరోసారి వైసీపీ మూకలు రెచ్చిపోయారు. తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) సభ వేదిక కూల్చేందుకు వైసీపీ కుట్రకు తెరదీసింది.
Andhraprdesh: ముఖ్యమంత్రి వైస్ జగన్ మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి, టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పల్నాడులో ఏ విధంగా ఓటు అడుగుతారని ప్రశ్నిస్తూ.. జగన్‌ను ఏకిపారేశారు. పల్నాడు జిల్లాలో ముఖ్యమంత్రికి ప్రచారం చేసే అర్హత లేదని అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ..పల్నాడులో ఓటు అడిగే హక్కు జగన్‌కు లేదన్నారు. హత్యలకు అడ్డంగా పల్నాడు మారిందని.. జగన్ పాలనలో పల్నాడు అభివృద్ధి శూన్యమని విరుచుకుపడ్డారు.
పల్నాడు జిల్లా: తెలుగుదేశం నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ సత్తెనపల్లిలో ఔదార్యం చూపించారు. జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభకు సత్తెనపల్లి ఆర్టీసీ డిపో బస్సులు వెళ్లాయి. దీంతో బస్సులు లేక ప్రయాణికులు రోడ్లపై ఎండలో పడిగాపులుగాస్తున్నారు.
సంక్షేమం అనే ముసుగులో సీఎం జగన్ రెడ్డి భారీ దోపిడీ చేస్తున్నారని మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ (Kanna Lakshminarayana) ఆరోపించారు.
Andhrapradesh: బ్రిటీష్ వారికంటే దారుణంగా సీఎం జగన్ రెడ్డి తయారయ్యారని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు గుప్పించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. వ్యాపారం పేరుతో భారత్‌కు వచ్చి, సొంత సైన్యం ఏర్పాటు చేసుకొని బ్రిటీష్ వారు మొత్తం దేశాన్ని ఆక్రమించి ఇక్కడి సంపద కొల్లగొట్టారన్నారు.