Share News

Minister Savita: అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఏర్పాట్లు..

ABN , Publish Date - Jun 19 , 2025 | 10:50 AM

Yoga Day: విశాఖ నగరంలో ఈ నెల 21న (శనివారం) జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవానికి అన్నీ ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి సవిత తెలిపారు. ఈ కార్యక్రమానికి కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు, విద్యార్థిని, విద్యార్థులు, ప్రజలందరూ పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపిచ్చారు.

Minister Savita: అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఏర్పాట్లు..
Minister Savita

విశాఖ: నగరంలో ఈనెల 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవం (International Yoga Day) విజయవంతం చేయడానికి అన్ని ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయని, యోగాలో ప్రపంచ రికార్డు (World Record) సృష్టిస్తామని మంత్రి సవిత (Minister Savita) అన్నారు. ఈ సందర్భంగా గురువారం ఆమె ఏబీఎన్ ఆంధ్రజ్యోతి (ABN Andhrajyothy)తో మాట్లాడారు. ప్రజల అందరికీ ఆరోగ్యం కోసం యోగా అని.. ప్రతిరోజూ అందరూ చేయాలని పిలుపిచ్చారు. మతాలు, కులాలు, ప్రాంతాలకు అతీతంగా యోగ దినోత్సవంలో అందరూ పాల్గొనాలని అన్నారు. పార్టీలను పక్కన పెట్టి.. అందరూ పాల్గొనాలని.. శవ రాజకీయాలు చేయవద్దని.. యోగా అందరూ చేయాలని మంత్రి సవిత సూచించారు.


విశాఖ ప్రజల అదృష్టం...

విశాఖ మేయర్ పీలా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఈ నెల 21న (శనివారం) జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు ఆలోచన మేరకు యోగాను ప్రతిష్టాత్మకంగా తీసుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామన్నారు. అంతర్జాతీయ యోగా కార్యక్రమం విశాఖలో జరగడం విశాఖ ప్రజల అదృష్టమని అన్నారు. విశాఖలో జరిగే యోగా కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని పిలుపిచ్చారు. విశాఖలో యోగా కార్యక్రమం గిన్నిస్ బుక్ రికార్డుకు ఎక్కుతుందని, యోగాకు వచ్చే ప్రతి ఒక్కరికి జీవీఎంసీ తరఫున మౌలిక సదుపాయాలు కల్పిస్తామని, ఐదు లక్షల వరకు ప్రజలు యోగాలో పాల్గొంటారని భావిస్తున్నామన్నారు. తాను విశాఖ మేయర్‌గా ఉన్నప్పుడు.. అంతర్జాతీయ యోగా దినోత్సవం విశాఖలో జరగడం తన అదృష్టంగా భావిస్తున్నానని పీలా శ్రీనివాసరావు అన్నారు.


20, 21వ తేదీల్లో స్కూళ్లకు సెలవులు..

విశాఖ నగరంలో ఈనెల 21న (శనివారం) జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నగరంలోని అన్నీ స్కూళ్లకు 20, 21వ తేదీల్లో సెలవులు ఇస్తున్నట్లు డీఈవో ప్రేమ్ కుమార్ ప్రకటించారు.

యోగా వాక్...

విశాఖ ఆర్కే బీచ్ రోడ్‌లో యోగా డే సన్నాహక కార్యక్రమం గురువారం ఉదయం నిర్వహించారు. ఏయూ కన్వెన్షన్ సెంటర్ నుంచి కాళీ మాత ఆలయం వరకు యోగా వాక్ చేశారు. అలాగే విశ్వ ప్రియ ఫంక్షన్ హాల్‌కు ఎదురుగా యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు డీబీవీ స్వామి, సరిత, సత్యకుమార్, బీసీ జనార్దన్ రెడ్డి, ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ టి కృష్ణబాబు, మాజీ ఎమ్మెల్సీ మాధవ్ తదితరులు పాల్గొన్నారు.


అమలాపురం కిమ్స్ వైద్య కళాశాల మైదానంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఎంపీ, ఎమ్మెల్యే, పలువురు పట్టణ ప్రముఖులు.. యోగాసనాలు వేశారు. కిమ్స్ వైద్య కళాశాల చైర్మన్ చైతన్య రాజు ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈనెల 21న జరగనున్న అంతర్జాతీయ యోగ దినోత్సవం నేపథ్యంలో సన్నాహకంగా యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది వైద్య విద్యార్థులు పాల్గొని యోగాసనాలు వేశారు.


ఇవి కూడా చదవండి:

ఢిల్లీకి బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి

స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం..

ప్రకంపనలు రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం

For More AP News and Telugu News

Read Latest and Crime News

Updated Date - Jun 19 , 2025 | 10:50 AM