TDP Vs YSRCP Political War: అవన్నీ జగన్‌కు వెన్నతో పెట్టిన విద్య: ధూళిపాళ్ల నరేంద్ర
ABN , Publish Date - Jul 16 , 2025 | 12:23 PM
TDP Vs YSRCP Political War: రేషన్ మాఫియా పొన్నూరు దళితుడు బర్నాబాస్‌ను అత్యంత దారుణంగా హత్య చేస్తే బాధిత కుటుంబం తరపున తాము పోరాటం చేస్తే వైసీపీ ప్రభుత్వం స్పందించలేదని ధూళిపాళ్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. పాత కక్షలు, వ్యక్తుల మధ్య ఘర్షణను దాడిగా చిత్రీకరించి తమ మీద బురదజల్లాలనే ప్రయత్నం రోజు వారీగా చేస్తున్నారన్నారు.

గుంటూరు, జులై 16: రాష్ట్రంలో ఐదేళ్ల అరాచకానికి జగన్ మోహన్ రెడ్డే (Former CM Jagan Mohan Reddy) సూత్రధారి అని టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర (TDP Leader Dhulipalla Narendra) తీవ్రస్థాయిలో విమర్శించారు. ఈరోజు (బుధవారం) మీడియాతో మాట్లాడుతూ.. పొన్నూరు లాంటి ప్రశాంత పల్లెల్లో రక్తపు కత్తులు తిప్పింది వైసీపీ అంటూ మండిపడ్డారు. గుంటూరు దళిత విద్యార్థిని రమ్యను పట్టపగలు హత్య చేసినప్పుడు అంబటి బ్రదర్స్ నోళ్ళు తెరవలేదని గుర్తుచేశారు. తాడేపల్లి ప్యాలెస్‌కు కూతవేటు దూరంలో దళిత మహిళ మీద సామూహిక అత్యాచారం జరిగితే జగన్ చలించలేదని ఫైర్ అయ్యారు. టీడీపీ దళిత నేత బండ్లమూడి బాబురావు మీద అత్యంత కిరాతకంగా దాడికి పాల్పడితే వైసీపీ దళిత సంఘాలు కినుకువహించాయన్నారు ధూళిపాళ్ల.
మాపై బురదజల్లేందుకు యత్నం..
రేషన్ మాఫియా పొన్నూరు దళితుడు బర్నాబాస్‌ను అత్యంత దారుణంగా హత్య చేస్తే బాధిత కుటుంబం తరఫున తాము పోరాటం చేస్తే వైసీపీ ప్రభుత్వం స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాత కక్షలు, వ్యక్తుల మధ్య ఘర్షణను దాడిగా చిత్రీకరించి తమ మీద బురదజల్లాలనే ప్రయత్నం రోజు వారీగా చేస్తున్నారన్నారు. హత్యా రాజకీయాలు, ప్యాక్షన్ రాజకీయాలు జగన్ మోహన్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య అంటూ దుయ్యబట్టారు. తన నైజాన్ని పార్టీ శ్రేణులందరికీ అలవాటు చేశాడు జగన్ అని మండిపడ్డారు. వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయ క్లర్క్ రాసిన ఉత్తరాలు చదవటం ఆ పార్టీ నాయకుల వంతని, గంట గంటకు బులిటెన్లు చేయటం వైసీపీ మీడియా తంతు అంటూ వ్యాఖ్యలు చేశారు.
ఆ బంధాన్ని చెరచలేవు..
‘నా ప్రాంతానికి, నా ప్రజలకు నా జీవిత ప్రయాణం తెరిచిన పుస్తకం. వాస్తవాలు, కథనాలు, కథలు అన్నీ మా ప్రజలకు పూర్తి అవగాహన ఉంది. మీ అబద్ధాలు, తప్పుడు ప్రచారాలు. నా కుటుంబ రాజకీయ ప్రస్థానానికి ఈ ప్రాంతానికి ఉన్న అనుబంధాన్ని చెరచలేవు. ప్రజాక్షేత్రంలో ప్రజాస్వామ్యంలో ఆరు సార్లు శాసన సభ్యునిగా గెలిపించారు ఇక్కడి ప్రజలు’ అని ధూళిపాళ్ల నరేంద్ర పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
పోలీసులకు సవాల్ విసిరిన దొంగలు.. ఏకకాలంలోనే
వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ పట్ల ఎలా ప్రవర్తించారో తెలిస్తే..
Read Latest AP News And Telugu News