Share News

వరల్డ్‌ ఫుడ్‌ ఇండియా-2025’లో భాగస్వామిగా ఏపీ

ABN , Publish Date - Jul 16 , 2025 | 06:58 AM

కేంద్ర పరిశ్రమల మంత్రిత్వ శాఖ సెప్టెంబరు 25 నుంచి 28 వరకు న్యూఢిల్లీలోని భారత్‌ మండపంలో నిర్వహించనున్న ‘వరల్డ్‌ ఫుడ్‌ ఇండియా-2025’లో ఏపీ భాగస్వామిగా పాల్గొంటుంది.

వరల్డ్‌ ఫుడ్‌ ఇండియా-2025’లో భాగస్వామిగా ఏపీ

  • సెప్టెంబరు 25 నుంచి 28 వరకు ఢిల్లీలో మెగా ఈవెంట్‌

అమరావతి, జూలై 15 (ఆంధ్రజ్యోతి): కేంద్ర పరిశ్రమల మంత్రిత్వ శాఖ సెప్టెంబరు 25 నుంచి 28 వరకు న్యూఢిల్లీలోని భారత్‌ మండపంలో నిర్వహించనున్న ‘వరల్డ్‌ ఫుడ్‌ ఇండియా-2025’లో ఏపీ భాగస్వామిగా పాల్గొంటుంది. ఈ మేరకు అనుమతినిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పాలసీ 4.0, రాష్ట్రంలో అందుబాటులో ఉన్న ముడి పదార్థాలు, నైపుణ్యం కలిగిన మానవ వనరుల లభ్యత, సహాయక మౌలిక సదుపాయాలను ‘వరల్డ్‌ ఫుడ్‌ ఇండియా-2025’లో ప్రదర్శించనున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం తరపున సుమారు రూ.1.271 కోట్ల బడ్జెట్‌ను భరించడానికి ఆంధ్రప్రదేశ్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సొసైటీని నోడల్‌ ఏజెన్సీగా నియమించింది.

Updated Date - Jul 16 , 2025 | 07:00 AM