Share News

Puttaparthi Theft Incident: పోలీసులకు సవాల్ విసిరిన దొంగలు.. ఏకకాలంలోనే

ABN , Publish Date - Jul 16 , 2025 | 11:52 AM

Puttaparthi Theft Incident: ఒకేసారి 10 ఇండ్లలో చోరీ జరగడంతో ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది అవాక్కైన పరిస్థితి. అయితే దుండగులు చోరీ చేసిన ప్రదేశంలో కలెక్టర్ బంగ్లా కూడా ఉండడం విశేషం.

Puttaparthi Theft Incident: పోలీసులకు సవాల్ విసిరిన దొంగలు.. ఏకకాలంలోనే
Puttaparthi Theft Incident

శ్రీ సత్య సాయి జిల్లా, జులై 16: జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. భారీ ఎత్తున చోరీకి పాల్పడి పోలీసులకు సవాల్ విసిరారు దొంగలు. పుట్టపర్తి సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి స్టాఫ్ క్వార్టర్స్‌లో భారీ చోరీ జరిగింది. గత రాత్రి ఏకకాలంలో ఆస్పత్రి స్టాఫ్ క్వార్టర్స్‌లో దాదాపు పది ఇళ్లలో దుంగులు చోరీకి తెగబడ్డారు. మూడు బ్లాక్లుల్లో 10 నివాసాల్లో చోరీ చేసిన దొంగలు భారీ ఎత్తున నగదు, బంగారు నగలను అపహరించారు. రాత్రి ఆస్పత్రి స్టాఫ్ విధుల్లో ఉన్నారు. ఉదయం వచ్చి చూడగా తమ ఇళ్లల్లో చోరీ జరిగినట్లు గుర్తించారు. వెంటనే ఈ విషయంపై పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు ప్రతీ ఇంట్లో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.


అయితే ఒకేసారి 10 ఇండ్లలో చోరీ జరగడంతో ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది అవాక్కైన పరిస్థితి. మరోవైపు దుండగులు చోరీ చేసిన ప్రదేశంలో కలెక్టర్ బంగ్లా కూడా ఉండడం విశేషం. నిరంతరం సెక్యూరిటీ ఉన్న ప్రాంతంలో చోరీ జరగడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ చోరీలపై పోలీసులు కేసు నమోదు చేసి అక్కడి సీసీ టీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అతి త్వరలోనే దుండగులను పట్టుకుని తీరుతామని పోలీసులు చెబుతున్నారు. ఇంత భారీగా దొంగతనం జరగడం పట్ల స్థానికులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే దొంగలను పట్టుకోవాల్సిందిగా పోలీసులను కోరుతున్నారు.


ఇవి కూడా చదవండి..

వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ పట్ల ఎలా ప్రవర్తించారో తెలిస్తే..

ఏపీలో దారుణం.. 'జై జగన్' అని అనలేదని బట్టలు విప్పి..!

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 16 , 2025 | 12:01 PM