Vijayawada: ఏపీలో దారుణం.. 'జై జగన్' అని అనలేదని బట్టలు విప్పి..!
ABN , Publish Date - Jul 16 , 2025 | 09:59 AM
Vijayawada: విజయవాడ పెనుమలూరులో దారుణం జరిగింది. 'జై జగన్' అని అనలేదని ఓ బీజేపీ కార్యకర్తపై వైసీపీ కార్యకర్తలు.. గంగాధర్, బొర్రా వెంకట్ దాడి చేసి, డబ్బులు లాక్కొని.. బట్టలు ఊడదీసి అవమానించారు. బాధితుడి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

విజయవాడ, జులై 16: ఏపీలో రాజకీయాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. తాజాగా విజయవాడ (Vijayawada) పెనమలూరులో వైసీపీ (YSRCP) అధినేత, మాజీ సీఎం జగన్ (Jagan) అభిమానులు రెచ్చిపోయారు. 'జై జగన్' అనాలంటూ బీజేపీ (BJP) కార్యకర్తకు వైసీపీ కార్యకర్తలు.. గంగాధర్, బొర్రా వెంకట్ బెదిరింపులకు పాల్పడ్డారు. జై జగన్ అనేందుకు బీజేపీ కార్యకర్త నిరాకరించడంతో.. అతని నుంచి ఫోన్, మూడు వేల రూపాయలు లాక్కొని.. ఒంటి మీద ఉన్న దుస్తులు ఊడదీసి, దాడి చేసి అవమానించినట్లు బాధితుడి తెలిపాడు.
పరారీలో నిందితులు..!
గాయాలతో ఆసుపత్రిలో చేరిన బాధితుడు మంగళవారం (జులై 15, 2025) న పెనుమలూరు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నట్లు సమాచారం. పెనుమలూరు పోలీసులు చెప్పిన సమాచారం మేరకు.. తాము ఈ కేసు విచారణ జరిపామని, బాధితుడి మీద నిజంగానే దాడి జరిగిందని అన్నారు. త్వరలోనే నిందితులను పట్టుకొని అరెస్ట్ చేసి న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అయితే ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యం వెలుగు చూసింది. ఈ దాడిని వైసీపీ అధిష్టానం ఖండిస్తుందో లేదో సమర్థిస్తుందో వేచి చూడాలి.
ఇవి కూడా చదవండి..
వాకింగ్ చేస్తున్న నేతపై కాల్పులు.. హైదరాబాద్‌లో దారుణం
మరికొన్ని గంటల్లో ఉరి.. అద్భుతం జరుగుతుందా?..