CSC in Engineering: సీఎస్‌ఈ.. కావాలి
ABN , Publish Date - Jul 16 , 2025 | 10:56 AM
బీటెక్ అంటే నేటి తరం విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో సాఫ్ట్‌వేర్ సంబంధిత కంప్యూటర్ సైన్స్(సీఎస్సీ) ఒక్కటే అనే భావం నెలకొంది. పెద్ద యూనివర్సిటీల నుంచి సాధా రణ ఇంజనీరింగ్ కళాశాలల్లో ఎక్కడైనా విద్యా ర్థులు సీఎస్సీ లేదంటే ఆ పేరుతో ఏర్పాటు చేస్తోన్న ఉప బ్రాంచ్‌లపైనే నూటికి 90 శాతం మంది ఆసక్తి చూపుతున్నారు.

సాఫ్ట్‌వేర్ బ్రాంచీలకే డిమాండ్
కంప్యూటర్ సైన్స్‌లో పది ఉప బ్రాంచీల ఏర్పాటు
వెబ్ కౌన్సెలింగ్‌లో ఎక్కువ మంది విద్యార్థుల ఆసక్తి
సివిల్, మెకానికల్ బ్రాంచీలను ఎత్తేసిన సగం కాలేజీలు
గుంటూరు(విద్య), జూలై 15 (ఆంధ్రజ్యోతి): బీటెక్ అంటే నేటి తరం విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో సాఫ్ట్‌వేర్ సంబంధిత కంప్యూటర్ సైన్స్(సీఎస్సీ) ఒక్కటే అనే భావం నెలకొంది. పెద్ద యూనివర్సిటీల నుంచి సాధా రణ ఇంజనీరింగ్ కళాశాలల్లో (Engineering Colleges) ఎక్కడైనా విద్యా ర్థులు సీఎస్సీ లేదంటే ఆ పేరుతో ఏర్పాటు చేస్తోన్న ఉప బ్రాంచ్‌లపైనే నూటికి 90 శాతం మంది ఆసక్తి చూపుతున్నారు. మూడు రోజుల నుంచి ఇంజనీరింగ్ కోర్సులకు సంబంధించి వెబ్ కౌన్సెలింగ్ (Web Counseling) జరుగుతోంది. ఆదివారం నుంచి విద్యార్థులు కోర్సులు, కళాశా లలకు ఆప్షన్లు ఇచ్చుకుంటున్నారు. అయితే ఇప్పటి వరకు గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల పరిధిలోని ఏఈపీసెట్‌లో అర్హత సా ధించిన విద్యార్థుల్లో అత్యధికమంది సీఎస్‌ఈ లేదంటే దాని ఉప బ్రాంచ్‌ల్లో చేరేందుకు ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే గుంటూరు జిల్లాలోని ఇంజనీరింగ్ కళాశాలలో ఇతర జిల్లాల విద్యార్థులు భారీ సంఖ్యలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు.
ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఈఏపీ సెట్‌లో 25 వేల మంది విద్యార్థులు అర్హత సాధించగా 30 వేలకు పైగా సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇతర జిల్లాల నుంచి వచ్చే విద్యార్థులతో పూర్తిస్థాయిలో ఇంజనీ రింగ్ కళాశాలలో సీట్లు భర్తీ అయ్యే అవకాశం ఉందని ప్రిన్సిపాల్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో నాగార్జున యూని వర్సిటీ(గుంటూరు), జేఎన్‌టీ యూకే(నరసరావుపేట) క్యాంపస్‌లతో పాటు 36 ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. గతంలో ఆయా కళాశాలలో సీఎస్‌ఈ, ఈసీఈ, ఈఈఈ, సివిల్ మెకానికల్, కెమికల్ ఇంజనీ రింగ్ తదితర బ్రాంచీలు ప్రధానంగా ఉండేవి. అయితే నాలుగైదేళ్ల నుంచి సీఎస్సీలో వచ్చిన సబ్ బ్రాంచీల కారణంగా సివిల్, మెకానికల్, కెమికల్ బ్రాంచీల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపలేదు. ఒక్క సీఎస్సీలోనే దాదాపు పది ఉప బ్రాంచీలు ఉన్నాయంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గతంలో సీఎస్సీలో రెండు బ్రాంచ్‌లు మాత్రమే ఉండగా ప్రస్తుతం ఏఐఎంఎల్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐటీ, బిజినెస్ అడ్మినిరేస్టషన్ ఇలా ఉప దాదాపు పది బ్రాంచ్‌లను ఏర్పాటు చేశారు. 36 కాలేజీల్లో సగం కాలేజీల్లో సివిల్, మెకానికల్, కెమికల్ బ్రాంచీల్లో సీట్లు భర్తీ కావడం లేదు. దీంతో క్రమంగా కళాశాలలు వీటిని ఎత్తివేసి కంప్యూ టర్ కోర్సులకు సంబంధించిన బ్రాంచ్‌లను ప్రవేశపెడుతున్నాయి.
భారీ ప్యాకేజీల మోజుతో..
ఇంజనీరింగ్‌లో సీఎస్సీ, ఐటీ బ్రాంచ్‌ల్లో అత్యధికంగా విద్యార్థులు చేరడానికి కారణం భారీ ప్యాకేజీలే కారణమని అధ్యాపకులు చెబుతున్నారు. సివిల్, మెకానికల్, కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారికి ప్రారంభ జీతం రూ.15 వేల నుంచి 25 వేల లోపు ఉంటే కంప్యూటర్ బ్రాంచీల్లో ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులకు రూ.25 వేల నుంచి రూ.75 వేల వరకు ప్రారంభ జీతం ఉంటోంది. దీనికి తోడు వైట్ కలర్ ఉద్యోగుల మాదిరి ఏసీ గదుల్లో కూర్చుని పనిచేయవచ్చు. దీనికి తోడు ఉద్యోగులకు ఆయా సాఫ్ట్‌వేర్ కంపె నీలు అనేక సౌకర్యాలు కల్పిస్తున్నాయి. ఫలితంగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగా లు కల్పించే బ్రాంచీల వైపే విద్యార్థులు మొగ్గ చూపుతున్నారని అధ్యాపకులు చెబుతున్నారు.
ఉపాధి అవకాశాలు ఉన్నా...
తొలుత బీటెక్‌లో మెకానికల్, సివిల్, కెమికల్ ఇంజనీరింగ్ కోర్సులు మాత్రమే ఉండేవి. కంప్యూటర్ కోర్సు రావడం.. గత కొన్నేళ్లుగా విద్యార్థుల్లో నెలకొన్న పరిణామాలతో మెకానికల్, సివిల్, కెమికల్ బ్రాంచీల్లో నిరాదరణకు గురయ్యాయి. ప్రధానంగా ఆయా బ్రాంచీల్లో డిగ్రీలు చేస్తే ఉపాధి కష్టమన్న భావన విద్యార్థుల్లో నెలకొందని కళాశాలల ప్రిన్సిపాల్స్ చెప్తున్నారు. కానీ ఇది వాస్తవం కాదంటు న్నారు. సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులకు నిర్మాణ రంగం లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉంటాయి. మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారు ప్లాంట్లలో అత్యధిక గంటలు నిల్చొని పనులు చేయాల్సి ఉంటుంది. ఏసీ గదుల్లో కూర్చుని పనిచేయడానికి అవకాశా లు చాలా తక్కువ కావడంతో ఈ బ్రాంచ్‌లకు విద్యార్థుల నుంచి డిమాండ్ తగ్గింది.
ఇవి కూడా చదవండి..
ఏపీలో దారుణం.. 'జై జగన్' అని అనలేదని బట్టలు విప్పి..!
సీపీఐ నేతపై కాల్పులు... నిందితులను గుర్తించిన పోలీసులు
Read Latest AP News And Telugu News